Thursday, April 18, 2024
- Advertisement -

‘ఆర్ఆర్ఆర్’ అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ఫస్ట్ లుక్!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి తనయుడు నట వారసుడిగా ‘చిరుత’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి.. తర్వాత తండ్రి తగ్గ తనయుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రామ్ చరణ్ నటించిన చిత్రాలు కొన్నే అయినా దాదాపు అన్నీ సూపర్ హిట్ గానే నిలిచాయి. చిరుత తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో బాక్సాఫీస్ షేక్ చేశాడు చరణ్. మరోసారి రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు.  శనివారం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్‌ను విడుదల చేసారు చిత్ర యూనిట్. బ్యాక్ గ్రౌండ్ లో మన్యం భగభగమండుతుండగా, అంబరానికి విల్లు గురిపెట్టిన రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రను ఆవాహన చేసుకున్న తీరు ఆ ఫొటో ద్వారా స్పష్టమైంది.

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హీందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -