సినిమా పరిశ్రమలో క్యాస్ట్ కౌచింగ్‌పై శ్రీరెడ్డి చేసిన పోరాటం ఇప్పుడు మరో దారి తీసింది. పవన్, అతని తల్లిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలతో సపోర్ట్‌గా ఉన్నవాల్లంతా ఇప్పుడు వ్యతిరేకంగా మారారు. టాలీవుడ్ పరిశ్రమపై వస్తున్న విమర్శలపై నాగబాబుతో పాటు పలువురు ప్రముఖులు ఆగ్రహంవ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా రామ్‌చరణ్‌తేజ్ పేస్బుక్ద్వారా స్పందించారు.
అందరూ కలిసి పని చేసుకుంటూ ఎదగాల్సిన ఒక కుటుంబం లాంటిది మన ఇండస్ట్రీ. మన ఇండస్ట్రీలో మహిళలను ఎప్పుడూ అత్యంత గౌరవంతో చూస్తారు. ఏవైనా సమస్యలు ఉన్నా వాటిని న్యాయబద్ధంగా, సంస్కారవంతంగా పరిష్కరించుకోవాలి. అయితే, కొందరి పేర్లు అనవసరంగా లాగి రాద్ధాంతం చేసి పాప్యులర్ అవ్వాలని చూడటం చవకబారుతనంగా ఉంటుంది’ అని ఆయన ఫేస్బుక్లో స్పందించారు.
ఈ సందర్భంగా తన బాబాయి, సినీనటుడు పవన్ కల్యాణ్ గతంలో అభిమానులను సహనంతో ఉండాలని చెప్పిన ఓ వీడియోను కూడా చెర్రీ పోస్ట్ చేశాడు.
