Friday, May 3, 2024
- Advertisement -

ఐపీఎల్‌లో కోహ్లీదే రికార్డ్‌…

- Advertisement -

టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ఖాతాలోకి మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. మంగళవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ శివాలెత్తిపోయాడు. 62 బంతులు ఎదుర్కొన్న విరాట్ 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 92 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

ఐపీఎల్, చాంపియన్స్ లీగ్, టీ20లలో కలిసి 5వేలకు పైగా పరుగులు సాధించిన తొలి ఆటగాడు కూడా కోహ్లీనే. ఐపీఎల్ ప్రారంభం నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్య వహిస్తున్న కోహ్లీ ఖాతాలో ప్రస్తుతం 4,619 పరుగులున్నాయి. దీంతో ఓ ఫ్రాంచైజీ తరుపున అత్యధిక పరుగులు సాధించిన రికార్డు కూడా కోహ్లీ సొంతమైంది. చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రైనా 4,558 పరుగులతో రెండో స్థానంలో ఉండగా, 4,345 పరుగులతో రోహిత్ శర్మ, 4,210 పరుగులతో గౌతం గంభీర్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

2008 ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి విరాట్ బెంగళూరుకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఒక ఫ్రాంఛైజీ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు విరాటే కావడం విశేషం. లీగ్ ముగిసేలోగా టాప్‌లో ఉన్న ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఈ జాబితాలో మార్పులు చోటుచేసుకుంటాయి.

బుధవారం వరకు ఐపీఎల్‌లో టాప్-5లో ఉన్నవారు వీరే:

1. విరాట్ కోహ్లీ- 4619
2. సురేశ్ రైనా-4558
3. రోహిత్ శర్మ-4345
4. గౌతం గంభీర్-4210
5. డేవిడ్ వార్నర్-4014

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -