Tuesday, May 21, 2024
- Advertisement -

బ్రేకింగ్……‘రంగస్థలం’ చిరంజీవి క్లాసిక్ హిట్ సినిమా రీమేక్

- Advertisement -

రంగస్థలం టైటిల్, టైటిల్ డిజైనింగ్, చరణ్-సమంతాల స్టిల్స్ అన్నీ కూడా సినిమా లవర్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాతో నటుడిగా తనను తాను పూర్తి స్థాయిలో ఆవిష్కరించుకోబోతున్నాడు చరణ్. కోటీశ్వరులు, సిటీ యూత్, రివేంజ్ తీసుకునే క్యారెక్టర్స్‌లొ యాక్ట్ చేయడం మన హీరోలకు చాలా చాలా సులభం. ఎందుకంటే ఆ ఎమోసన్స్ అన్నీ వాళ్ళ రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌కి దగ్గరగా ఉంటాయి కాబట్టి. కానీ ఫస్ట్ టైం చరణ్ భారీ రిస్క్ చేస్తున్నాడు. తనకు పూర్తిగా కొత్త అయిన గోదావరి ఒడ్డు పల్లెటూరి కుర్రవాడిగా….. అది కూడా బెస్తవాడిగా కనిపించబోతున్నాడు. అలాంటి క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నాడంటే చరణ్ గట్స్‌ని ఎంతైనా మెచ్చుకోవచ్చు. అలాగే సమంతా, చరణ్‌లను పూర్తిగా సరికొత్తగా చూపిస్తూ ఈ పీరియడికల్ సినిమాను తెరకెక్కిస్తున్న సుకుమార్‌ని కూడా అభినందించాల్సిందే.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక హాట్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలోని చిట్టిబాబు క్యారెక్టర్ అలనాడు చిరంజీవి నటించిన క్లాసిక్ హిట్ ‘ఊరికిచ్చిన మాట’ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ నుంచి తీసుకున్నారట. చరణ్ హావభావాలన్నీ కూడా ఆ క్యారెక్టర్‌నే పోలి ఉంటాయని యూనిట్ మెంబర్స్ చెప్తున్నారు. అలాగే సినిమా కథ కూడా ఊరికోసం పాటుపడే యువకుడి కథనే అట. ఓల్డ్ క్లాసిక్ హిట్‌ కథను తీసుకుని ‘అ…ఆ’ సినిమాతో త్రివిక్రమ్ హిట్ కొట్టినట్టుగా ఈ సారి సుకుమార్ కూడా చిరంజీవి సినిమా ‘ఊరికిచ్చిన మాట’ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని నాటి సమాజాన్ని, రాజకీయ పరిస్థితులను ఆసక్తికరంగా చెప్పబోతున్నాడు. ఒక ఊరిలో ఉండే అలాంటి అన్ని విషయాలను టచ్ చేస్తూ…..ఒక అందమైన ప్రేమకథను రంగరించి ఈ ‘రంగస్థలం’ కథను రెడీ చేశాడు సుకుమార్. ‘అ…ఆ.’ సినిమాలాగే రంగస్థలం కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే మాత్రం తెలుగునాట ఇదో సరికొత్త ట్రెండ్‌గా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు. చిరు టైటిల్ ‘మగధీర’తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన చరణ్…..ఈ సారి చిరంజీవి సినిమా రీమేక్‌తో ఏ స్థాయి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -