పవన్ – కొణతాల భేటీ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ తో సీనియర్ నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి మాగంటి బాబు భేటీ కాగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఇక తాజాగా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సైతం పవన్‌తో భేటీ కానున్నారు. ఏపీలోని అనకాపల్లిలో తన మద్దతుదారులు, అనుచరులతో సమావేశం అనంతరం పవన్‌తో భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని ఆశీస్తున్నారు కొణతాల.

కాంగ్రెస్‌ నుండి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు కొణతాల. 1989,1991లో అనకాలపల్లి నుండి ఎంపీగా గెలిచారు. తిరిగి 2004లో అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్‌ వైఎస్‌ఆర్‌సీపీని స్థాపించాక ఆయన వెంట నడిచారు. అయితే తర్వాత విభేదాల కారణంగా పార్టీ నుండి దూరం కాగా జనసేనలో చేరనున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగోంది. తాజాగా పవన్‌తో భేటీ అవుతుండటంతో ఆ వార్తలకు బలం చేకూరినట్లైంది.