Friday, May 3, 2024
- Advertisement -

రాజరథంలో భల్లాలదేవుడిగా కనిపించనున్న రానా.. సూపర్ డైలాగ్స్… వెరీ ఇంట్రెస్టింగ్ ట్రైలర్

- Advertisement -

బాహుబలి సినిమాలో బాహుబలిగా ప్రభాస్ ఏ స్థాయిలో ఇరగదీశాడో అదే స్థాయిలో భల్లాలదేవుడిగా మెప్పించాడు రానా. బాహుబలి మొదటి పార్ట్‌లో అయితే ప్రభాస్ కంటే రానాకే ఎక్కువ పేరు వచ్చింది. బాహుబలి-2తో భల్లాలదేవుడి కథ కూడా ముగిసిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ రానా మాత్రం ఇప్పుడు మరోసారి భల్లాలదేవుడిగా తెరపై దర్శనమివ్వనున్నాడు. తెలుగు, తమిళ్ సినిమాగా తెరకెక్కుతున్న రాజరథం సినిమాలో భల్లాలదేవుడిగా మరోసారి కనిపించనున్నాడు రానా. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.

ఒక సెకన్ ఎక్కువ చూపిస్తే ఎక్కడ కథ తెలిసిపోతుందోనని భయపడుతూ ఉంటారు చాలా మంది ఫిల్మ్ మేకర్స్. కానీ రాజరథం యూనిట్ మాత్రం చాలా పెద్ద ట్రైలర్ కట్ చేసింది. ట్రైలర్‌లో రానా చెప్పిన వాయిస్ ఓవరే హైలైట్. కృష్ణం వందే జగద్గురంలోనే డైలాగులతో మెప్పించిన రానా బాహుబలితో సూపర్ గ్రిప్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు రాజరథం సినిమాకు చెప్పిన వాయిస్ ఓవర్‌తో కూడా మెప్పించాడు రానా. రాజరథంలో హీరో ఎవరు అంటూ రానా ఇచ్చిన వాయిస్ ఓవర్ బాగుంది. ఇక క్యారెక్టర్స్ రివీల్ చేసిన విధానం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. అలాగే ఓ కొత్త కథతో వస్తున్నారని మాత్రం అర్థమైపోతంది. చివరగా ఈ సినిమాలో హీరో నేను…నా క్యారెక్టర్ ఏంటి అంటూ రానా డైలాగ్ చెప్పడం. …అదే టైంలో బాహుబలి సినిమాలో భల్లాలదేవుడి పోస్టర్ తెరపైకి రావడం చూస్తూ ఉంటే ఈ సినిమాలో మరోసారి భల్లాలదేవుడిగా కనిపించనున్నాడన్న ఊహాగానాలు నిజమనిపిస్తున్నాయి. అయితే ఈ సారి విలన్‌గా కాకుండా రాజుగా దర్శనమివ్వనున్నాడు. మరి బాహుబలి సినిమాలో విలన్ అవ్వడంతో కిరీటం దక్కినప్పటికీ రాజ్యం నిలబెట్టుకోలేకపోయిన భల్లాలదేవుడు ఈ సారి రాజరథంలో రాజుగా ఏ స్థాయిలో ఇరదీస్తాడో చూడాలి. ట్రైలర్ చూస్తుంటే మాత్రం ఇంప్రెసివ్‌గానే అనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -