Thursday, May 9, 2024
- Advertisement -

కష్టం డైరెక్టరిది… ఫలితం హీరోది.. అల్లు కాంపౌండ్లో అంతే

- Advertisement -

ఒక్క క్షణం హిట్ తో అల్లు కాంపౌండ్ తెగ సంబరపడిపోతుంది. డైరెక్టర్ విఐ ఆనంద్ …బన్నీతో సినిమా చేద్దామని వెళితే…అతనికి శిరీష్ ను అప్పగించారు. సేమ్ టు సేమ్ సీన్ గతంలో మారుతికి ఎదురైంది.అయితే ఆటైమ్లో ఓకే అనిపించుకున్నాడు.కాని హిట్ కొట్టలేకపోయాడు. బట్ ఇక్కడ విఐ ఆనంద్ శభాష్ అనిపించుకున్నాడు. అల్లు అర్జున్ ఇమేజ్ ను పెంచే విధంగా విఐ ఆనంద్ పై అల్లు అరవింద్ కు కూడా ఇపుడు నమ్మకం వచ్చింది.

ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో బన్నీ చెప్పినట్లుగానే ఈసినిమా మీనింగ్ ఫుల్ ఎక్స్ పరిమెంట్ గానే ఉంది. అల్లు అరవింద్ కూడా కథ నచ్చే విఐ ఆనంద్ కు మంచి అవకాశమిచ్చాడు. అయితే కొంతమంది బయట చెబుతున్న దాని ప్రకారం విఐ ఆనంద్ యువి క్రియేషన్స్ లేదా దిల్ రాజు దగ్గరకు పోతే మంచి విషయమున్నే హీరో ఒక్క క్షణం చిత్రానికి దొరికేవాడు అనేవారు ఉన్నారు. ఈ సినిమాకు శిరీష్ మైనస్ అనే విషయం చాలామంది చెబుతున్నారు.

తన తమ్ముడు విషయమున్నవాడని బన్నీ ప్రీరిలీజ్ లో డబ్బా కొట్టబట్టే…శిరీష్ లోని లోటు కనిపించకుండా ఈసినిమా టాక్ మనోడిని కవర్ చేస్తుంది. ఇపుడు ఈసినిమా టాక్ తో క్రెడిట్ అందరూ విఐ ఆనంద్ కు ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తుంటే..అల్లు కాంపౌండ్ అతనికిచ్చేది అతనికిస్తూనే.. మిగతా క్రెడిట్ అల్లు శిరీష్ కు అంటగడదామని చూస్తున్నారు.అలాగైనా శిరీష్ ఇమేజ్ పెంచే పనిలో అరవింద్ అండ్ కో ఉన్నట్లు తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -