బాహుబలి చిత్రం సృష్టించిన రికార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పింది ఈ చిత్రం. ఈ చిత్రంలో నటించిన నటీనటులు తమ నటనతో ప్రేక్షకులను మెస్‌మరైజ్ చేశారు. బాహుబలి రోల్ లో ప్రభాస్ కు ఎంతటి మంచి పేరు వచ్చిందో అలాగే ఈ ఇదే చిత్రంలో విలన్ గా భళ్లాలదేవుడి పాత్రలో నటించిన రానాకు కూడా అదే రెంజ్ లో పేరు వచ్చింది.
వీరిద్దరూ ఈ చిత్రంలో నువ్వా నేనా అనే విధంగా నటించారు. ఇక ప్రస్తుతం బాహుబలి -ది కన్‌క్లూజన్ షూటింగ్ వేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ చిత్రంపై రోజుకో వార్త బయటకు వస్తూ సినిమాపై మరింత హైప్ క్రీయేట్ అవుతుంది. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన సంగతులను రానా వెల్లడించాడు. మొదటి భాగంలో ప్రభాస్ ను బాహుబలి రోల్ లో చూపించిన విధనం చాలా బాగుంది.
ఇక రెండో భాగంలో అంతకు మించిన సీన్స్ ఉంటాయి అని రానా అంటున్నాడు. నెగటివ్ షేడ్స్ ఉన్న భళ్లాలదేవ పాత్ర సెకెండ్ పార్ట్‌లో చాలా కీలకంగా ఉంటుందని ఇందులో ప్రభాస్ కంటే ఎక్కువ రానా పాత్ర ఉంటుందని అంటున్నాడు. అంటే రెండో భాగంలో భళ్లాలుడే ఎక్కువ అని చెబుతున్నాడు రానా. ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.
