Saturday, May 18, 2024
- Advertisement -

జాతీయ స్థాయిలో తెలుగోడి సత్తా!

- Advertisement -

తెలుగోడి సత్తా ఏంటో.. జాతీయ స్థాయిలో మరోసారి ప్రూవ్ అయ్యింది. ఎన్ఐటీ, ఐఐటీ ప్రవేశ పరీక్షల్లో ఏటా టాప్ ర్యాంకులు సొంతం చేసుకున్న మన తెలుగు విద్యార్థులు.. ఈ సారి కూడా టాలెంట్ చూపించారు. టాప్ 20 ర్యాకుల్లో.. నాలుగింటిని మన వాళ్లే సొంతం చేసుకున్నారు. అమ్మాయిల్లో తెలంగాణకు చెందిన గాయత్రి.. టాప్ ప్లేస్ కొట్టేసింది. అందరితో కలిపి జాతీయ స్థాయిలో 11వ ర్యాంకు దక్కించుకుంది. బీ ఆర్క్ పరీక్షలో కూడా టాప్ 10 ర్యాంకుల్లో.. 8 మంది మనవాళ్లే ఉన్నారు. జేఈఈ మెయిన్స్ లో ఢిల్లీ చెందిన దీపాన్షు టాపర్ గా నిలిచాడు.

ఇక.. జేఈఈ మెయిన్స్ లో టాప్ 5 వ ర్యాంకును ప్రశాంత్ రెడ్డి, ఆరో ర్యాంకును తాళ్లూరి సాయితేజ, 11వ ర్యాంకును ర్యాలి గాయత్రి, 18వ ర్యాంకును జయంత్ రెడ్డి దక్కించుకుని.. మరోసారి తెలుగు విద్యార్థుల ఆధిపత్యాన్ని చాటారు. మరోవైపు.. పరీక్షలు, ఫలితాలు ముగియడంతో.. ప్రవేశాలపై అధికారులు దృష్టి పెట్టారు. ఇవాల్టి నుంచే ఐఐటీల్లో ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు మొదలు కానున్నాయి.

ఈ నెల 27 న సీట్ల నమూనా కేటాయిస్తారు. 30న తొలి విడత సీట్లు కన్ఫమ్ చేస్తారు. సీట్లు అంగీకరించేందుకు 4 నుంచి 5 రోజుల గడువు ఇస్తారు. తర్వాత రోజుల భర్తీ అయిన సీట్లు, ఖాళీ సీట్ల వివరాలు ప్రకటించి.. రెండో దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ మొదలు పెడతారు. రెండో దశ సీట్ల అంగీకారం, ఉపసంహరణ తర్వాత మూడో దశ, నాలుగో దశ ప్రక్రియలు కూడా ఇలాగే చేపడతారు. దీంతో.. తమకు వచ్చిన ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకునేందుకు విద్యార్థులు అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -