Friday, May 17, 2024
- Advertisement -

మల్టీస్టారర్ టైటిల్ కే ఫిక్సైపోయిన టాలీవుడ్ హంక్!

- Advertisement -

టాలీవుడ్ హంక్ రానాకు మల్టీస్టారర్ చిత్రాలంటే భాగా ఇష్టమనుకుంట. అందుకే ఏరి కోరి మరీ… తన కెరియర్లో అవే ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. సోలో పర్ ఫార్మెన్స్ కంటే ఇదే బెటరనే ఉద్దేశ్యానికి వచ్చేసిన రానాకు ఇపుడంతా ది మల్టీస్టారర్ అనే టైటిల్ కట్టపెట్టేసే ఆలోచనలో ఉన్నారు.

బాహుబలిలో భల్లాల దేవగా కనిపించి దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయిన హీరో…. రానా.ఈసినిమాతో తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని భాషల్లోనూ సరికొత్త స్టార్‌గా అవతరించాడు. ఇక ఇంతకుముందే తమిళ, హిందీల్లో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన రానాకు, బాహుబలి తర్వాత ఆయా ఇండస్ట్రీల నుంచి క్రేజీ ఆఫర్స్ చుట్టు ముడుతున్నాయి. ఎంతలా ముట్టినప్పటికీ…మనోడు కేవలం  మల్టీస్టారర్ చిత్రాలకే ఫిక్స్ అయిపోతున్నాడు.

రానాకు బిటౌన్లో మాంచి పిఆర్ ఉంది. అక్కడ మల్టీస్టారర్ చిత్రాల్లో యాక్టింగ్ చేస్తూ మనోడు తెగ దూసుకుపోతూ ఉన్నాడు. దమ్ మారో దమ్ లో అభిషేక్ తో స్కీన్ షేరింగ్ చేసుకున్నాడు. బేబీలో అక్షయ్ తో తళుక్కుమన్నాడు. ఆ ఇదితో రానా కంటూ బిటౌన్లో ఓ ఇమేజ్ వచ్చిపడింది. తాజాగా కోలీవుడ్లో శింబు,ఆర్యలతోను కలిసి నటిస్తోన్నాడు. ఇది చాలదన్నట్లు  తమిళ స్టార్ హీరో అజిత్ ప్రధాన పాత్రలో కనిపించనున్న ఓ చారిత్రక కథలో మనోడు మెరవబోతున్నాడు. 

రానా చేస్తోన్న ఈ సినిమాలను చూస్తుంటే రానా ఇక పూర్తిగా మల్టీస్టారర్ హీరోగా మారిపోతాడా అని పిస్తుంది. కొన్ని సందర్బాల్లో బాబాయ్  వెంకీని రానా ఫాలో అవుతున్నాడా అనే ఆలోచన కూడా వస్తోంది. మొత్తానికి రానా ఇపుడున్న టైమ్లో ది మల్టీస్టారర్ అనే టైటిల్ కు న్యాయమైతే చేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -