Tuesday, May 21, 2024
- Advertisement -

మెగా హీరోలపై సోషల్ మీడియాలో భారీ చర్చ

- Advertisement -

గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియా మెగా హీరోల్లో వీరు బెస్ట్ వారు బెస్ట్.అతను ఇతనంత కాదు.ఇతను అతనంత కాదు అంటూ కొందరు పనిగట్టుకుని మరీ ఊదరగొట్టేస్తున్నారు. మరి ఎవరిలో ఎంతుందో అలా కామెంట్ చేసిన వారైనా  చెప్పారా అంటే అదీ లేదు. కనీసం ఎవరిలో ఎంతటి మ్యాటర్ ఉందని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు.

ఆధ్యా న్యూస్ ఈవిషయంలో కొందరు మెగా అభిమానుల వైఖరిని, అలాగే మిగతా హీరోల అభిమానుల నుంచి కూడా ఎందుకు మెగా హీరోల విషయంలో ఇంతటి చిరాకును వ్యక్త పరుస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో తెలంగాణ ,రాయలసీమ  సినీ ప్రియులనుంచి కరెక్ట్ విషయాలు మాకు వచ్చాయి.కోస్తల్ ఏరియాలో సామాజిక వైషమ్యాలు ఉంటాయి కాబట్టి… దానికి తగ్గట్లుగా వారి అభిప్రాయాలను వెల్లబుచ్చారు.మరి మెగా హీరోల గురించి వచ్చిన ఆ ఇష్టాలు,అయిష్టాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నమైతే చేద్దాం.

రామ్ చరణ్ : చిరంజీవి వారసుడిగా రెడ్ కార్పెట్ వేసుకునీ మరీ చెర్రీ వచ్చాడు.అయితే అతన్ని చిరు ఇమేజ్  కొన్ని సందర్బాల్లో కాపాడింది. ఎట్ ది సేమ్ టైమ్ తన పని తాను చేసుకుపోతాడు.సీరియస్ గా కష్టపడతాడు. ఇది మెగా అభిమానుల అసలు సిసలు అభిప్రాయం.

బయట జనాలు చెప్పేది ఏంటంటే…చిరు లేందే ఇతను లేడనేది.కాని సీమ,తెలంగాణ జనాలు ఒక విషయంలో మాత్రం మెగా హీరోల్లో అందరికంటే చెర్రీని బాగా మెచ్చుకున్నారు.అదేంటో తెలుసా.ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్ కు, చిన్న హీరోలతో చేసుకునే దర్శకుడికి అవకాశాలు ఇచ్చి సూపర్ హిట్లు కొడతాడు.కేవలం బ్రూస్ లీ విషయంలో మాత్రమే అతని అంచనా తప్పిందని.క్యారెక్టర్ పరంగా బన్నీతో పోల్చుతే ఇతనే బెటరనేది.

అల్లు అర్జున్ :  మెగా హీరోగానే లాంచింగ్ జరిగినప్పటికీ… నిలదొక్కుకోవడం మాత్రం తన టాలెంట్ ,తండ్రి అరవింద్ ప్లాన్ తో జరిగిందని బన్నీ ఫ్యాన్స్ చెబుతున్నారు.ఇదే విషయాన్ని మిగతా హీరోల అభిమానులు ,సినీ లవర్స్ కూడా ఒప్పుకుంటున్నారు.కాకపోతే చిరు ప్రస్థావన అనేదే లేకుండా బన్నీ నిలబడాలని కొందరు కోరుకుంటున్నారు.ఎందుకంటే అతని ప్రతి స్టెప్ లోను కష్టం కనిపిస్తుంది.కొన్ని సందర్బాల్లో ఆడియో లాంచ్స్ లో బన్నీ చెప్పే మాటలు అతను మనసులో ఏదో పెట్టుకుని లౌక్యాన్ని ప్రదర్శిస్తున్నాడంటున్నారు.ఇది కొందరికి నచ్చడం లేదు.

వరుణ్ ,సాయిధరమ్ తేజ్ లు: ఇద్దరూ ఇద్దరే.వరుణ్ ను చూస్తోన్న ప్రతి ఒక్కరు మెగా వారుసుడిగా అతన్ని  చూడకుండా ఏదో సాధించాలని కోరుకునే యువకుడిగా కనిపిస్తున్నాడు. ముకుంద విషయంలో సామాజిక అంశాలు పరిగణలోని వచ్చినప్పటికీ… కంచె మ్యాటర్లోకొచ్చే సరికి అవన్నీ కనిపించకుండా పోయాయి.ప్రయోగాన్ని నమ్ముకున్న మెగా హీరోగా అతను గుర్తింపుకు నోచుకున్నాడు. ఇంకో రెండు చిత్రాలు అయితే తప్ప ఇతనిపై కామెంట్స్ అనేవి రావచ్చా లేనిది తెలిసిపోతోంది. ఇక సాయి గురించి ఎంత చెప్పినా తక్కువే.మెగా కాంపౌండ్ కే తెలియకుండా ఆడిషన్స్ కు అటెండ్ అయిన వ్యక్తి.అంటే రేపన్న రోజు మెగా కాంపౌండ్ మద్దతిచ్చినా ఇవ్వకపోయినా తన దారిలో తన గమ్యాన్ని వెతుక్కునే మహా ముదురు.అల్లు అరవింద్ అంతటోడే సాయిని చూసి విస్తుపోయాడంటే ఇక ఏం చెబుతాం చెప్పండి.తెలిసి తెలియకుండా చెప్పకుండా చేయాల్సిన రాచకార్యాన్ని చేసేసే కుర్రాడు. 

ఇతనేంటో సోషల్ మీడియా జనాలకు ఇంకా ఇప్పటికీ అర్ధం కాలేదు. అభిప్రయాన్ని వెలిబుచ్చాలన్నా  ఏం చెప్పాలో అర్ధంకాని స్థితి.

సో ప్రస్తుతానికి చరణ్ ,బన్నీల మీదనే సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతుంది.మిగతా ఇద్దరు రెస్ట్ మోడ్ లో ఉన్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -