Monday, May 6, 2024
- Advertisement -

గేమింగ్ నుంచి సినిమాల నిర్మాణం వరకూ….

- Advertisement -

టాలీవుడ్ హంక్ అనే పదానికి కరెక్ట్ నిర్వచనం….. రానా. మాంచి హైట్ ,పర్సనాలిటీతో రానా ముందునుంచి అందరినీ భలే ఆకట్టుకుంటూ ఉన్నాడు. అదే రీతిలో అటు బిటౌన్ ,ఇటు సౌత్లో తాను చేసిన చిత్రాల వరకూ సార్ శరవేగంగా తనకంటూ ఓ మార్కెట్ ను విస్తరించుకున్నాడు. దీంతో అంతా రానా ఇక నైనా నటనపైనే ఫుల్ కాన్ సెంట్రేట్ చేస్తాడు అని చెప్పారు.ఆల్మోస్ట్ అలాంటి సిగ్నల్స్ నే మనోడు ప్రేక్షకులకు ఇచ్చాడు.

 రానా తన ఫ్యూచర్ ప్లానింగ్స్ ను రివీల్ చేసేశాడు. అంతా అనుకుంటున్నట్లు మనోడు కేవలం నటుడిగానే కంటిన్యూ అవుతాడని చెప్పడానికి వీల్లేదు. అంతకు మించి  మరొకొటి చేస్తానంటున్నాడు. ఇపుడున్న టైమ్లో రానా ఆలోచన వేరేలా ఉంది. ఫస్ట్ నుంచి బిజినెస్ ను  ప్రొఫెషన్ గా తీసుకోవాలని చూసిన రానా… ఆ విషయంలో అంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ…. అంతకు మించి వేరేదో చేయాలనే తలంపుతో ఉన్నాడు. గతంలో ఎస్ ఎఫ్ ఎక్స్ కంపెనీ 

స్పిరిట్ మీడియాను స్థాపించి కొన్ని కంపెనీలకు గేమింగ్ లను తయారు చేసేవాడు. అయితే ఆ విషయంలో రానా అనుకున్నంత అధ్బుతాలు సృష్టించకపోవడంతో మళ్లీ సినిమాల వైపుకు మళ్లాడు. స్టార్టింగ్లో నిర్మాణం చేద్దామని 

కొన్ని సినిమాలను తీయాలని తలచినప్పటికీ అది అప్పట్లో సాధ్యపడలేదు. తాజాగా రానా ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రకారం ఫ్యూచర్లో కథ నచ్చితే తనతోనే సినిమా….. లేదంటే వేరే వారిని హీరోగా పెట్టి  సినిమా చేయాలని చూస్తున్నాడు. 

అంటే ఫైనల్ గా తన ఫాదర్ మాదిరిగా ప్రొడ్యూసర్ గా అవతారమెత్తుతానంటున్నాడు. దానికి తగ్గట్లుగా సినిమాలను నిర్మించే పనిలో రానా చూస్తున్నాడు. ప్రస్తుతానికి అయితే మల్టీ స్టారర్ గా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -