Monday, May 6, 2024
- Advertisement -

అఖిల్ ఫెయిల్యూర్ తో పండగ చేసుకున్న హీరో?!

- Advertisement -

అఖిల్ సినిమా డిజాస్టర్ కావడం ఇండస్ట్రీలో ఒక హీరోకు బాగా ఆనందాన్ని ఇచ్చే అంశంగా మారిందని ప్రచారం జరుగుతోంది. ఆ సినిమా ఫెయిల్యూర్ పట్ల ఈ హీరో పండగ చేసుకుని.. తన సన్నిహితులకు పార్టీ ఇచ్చినట్టుగా సమాచారం.

మరి అతడికి ఈ మ్యాటర్ లో అంత ఆనందం ఎందుకు… అంటే దాని వెనుక పెద్ద కథే ఉందని ప్రచారం జరుగుతోంది. అఖిల్ సినిమా ఫెయిల్ కావడంతో సంబరాలు చేసుకున్న వ్యక్తి మరెవరో కాదు.. నాగచైతన్య అనే అంటున్నారు. ఈ వ్యవహారంలో నిజం ఎంత ఉందో కానీ… గ్రాండ్ పార్టీ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది.

ఎందుకలా అంటే… తండ్రి నాగార్జున తనకన్నా అఖిల్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండటం, అఖిల్ సినిమా కోసం విపరీతంగా కష్టపడటం, ఎంతో శ్రద్ద వహించడం, తను సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పుడు మాత్రం ఇంత శ్రమ పడకపోవడం.. ఏదో నామినల్ గా తతంగాన్నిపూర్తి చేయడం పట్ల చైతూ బాగా అసంతృప్తిగా ఉన్నాడట. ఇలాంటి నేపథ్యంలో అఖిల్ రావడం అది కాస్తా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిలవ్వడంతో నాగార్జున పెద్ద కొడుకు ఆనంద పడ్డాడని ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ ప్రచారం పట్ల అక్కినేని ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ట్రాష్ అని వారు కొట్టి పడేస్తున్నారు. ఇలాంటి ప్రచారం చేస్తున్న వారిపై వారు ఆగ్రహావేశాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు కథ ఏమిటో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -