బాలీవుడ్‌లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన రాగిణి ఎమ్‌ఎమ్‌ఎస్ ఫ్రాంచైజీ ఇప్పుడు కొత్త రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాత ఏక్త కపూర్ నిర్మిస్తున్న “Ragini 3”లో హీరోయిన్‌గా తమన్నా నటిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమాలో ఆమెకు జోడీగా అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ కనిపించనున్నట్లు సమాచారం.
గతంలో Ragini MMS సిరీస్ హారర్‌తో పాటు గ్లామర్ అంశాల వల్ల పెద్ద చర్చకు దారి తీసింది. అయితే తాజా నివేదికల ప్రకారం, మేకర్స్ ఈసారి సినిమాను పూర్తిగా హారర్–కామెడీ లేదా “డేట్ నైట్ హారర్” జానర్‌లో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు. దీంతో పాత ఫ్రాంచైజీకి భిన్నమైన ట్రీట్‌మెంట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
మొదట ఈ చిత్రానికి సహిర్ రజా దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ షెడ్యూల్ సమస్యల కారణంగా ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని సమాచారం. తాజాగా దర్శకుడు శశాంక ఘోష్ ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నట్లు బాలాజీ మోషన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది.
ఈ ప్రాజెక్ట్‌లో తమన్నా నటించనున్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముఖ్యంగా Ragini MMS ఫ్రాంచైజీ ఇమేజ్ కారణంగా అభిమానులు మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం, సినిమా పాత భాగాల మాదిరిగా కాకుండా ప్రధానంగా హారర్, థ్రిల్లర్ అంశాలపైనే దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంతో తమన్నా భాటియా, జునైద్ ఖాన్ తొలిసారి కలిసి నటించబోతున్నారు. బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న తమన్నా, మరోవైపు జునైద్ తన కెరీర్‌లో కొత్త తరహా పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది.
