Monday, April 29, 2024
- Advertisement -

యానిమల్ ట్రైలర్..రణబీర్ విశ్వరూపం!

- Advertisement -

సందీప్ వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన చిత్రం యానిమల్. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. తెలుగు,హిందీ,తమిళం,కన్నడ,మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా విడుదల చేసిన ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. ట్రైలర్‌ని భట్టి చూస్తే తండ్రి, కొడుకుల మధ్య సాగే ఎమోషన్‌తో పాటు మాఫియా బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ట్రైలర్‌లో రణబీర్ విశ్వరూపం చూపించాడు. అద్భుత నటనతో ఎమోషన్, యాక్షన్ సీన్స్‌లో సూపర్బ్ అనేలా యాక్టింగ్ చేశాడు.హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించగా టి సిరీస్ – భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది.

ఈ మూవీ రన్‌ టైంని 201 నిముషాలు (3 గం. ల 21 ని. లు)గా లాక్ చేయగా ఏ సర్టిఫికెట్‌ని అందించారు. కేవలం అడల్ట్స్ మాత్రమే చూసే చిత్రం అని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడంతో ఎంత వయోలెన్స్‌గా ఉంటుందోనని అందరికి సందేహం రాగా ట్రైలర్‌లో అదే చూపించారు సందీప్. మీరు ఈ ట్రైలర్‌పై ఓ లుక్కేయండి…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -