Monday, May 6, 2024
- Advertisement -

రంగ‌స్థ‌లం ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వెన్యూడేట్ ఫిక్స్‌ ..

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న రంస్థ‌ల‌పై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ర‌లీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఇది అభిమానుల‌కు శుభ‌వార్తే .

రంగస్ధలం సినిమా ముస్తాబు అవుతున్న సంగతి తెలిసిందే. పూర్తి నాటుగా.. పల్లెటూరు బ్యాక్ డ్రాఫ్ లో సినిమా తయారు అవుతోందిది.ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు,ట్రైలర్స్, పాట సినిమాపై అంచనాలను పెంచేసాయి. మరో ప్రక్క సమంత, రామ్ చరణ్ ఫోస్టర్లు మరింత హీట్ పెంచుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేసింది టీమ్. చిత్రం ఆడియో ఈవెంట్ కానీ చిన్న ప్రమోషనల్ ఈవెంట్ ని ఈ నెలాఖరులో హైదరాబాద్ లో జరగనుంది. అయితే ప్రీ రిలీజ్ పంక్షన్ ని మాత్రం డిఫరెంట్ గా ప్లాన్ చేస్తోంది టీమ్ అని తెలుస్తోంది.

అయితే విశ్వ‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం తెలుగువారి కొత్త సంవత్సరం వేడుగ ..ఉగాది రోజున ప్రీ రిలీజ్ వేడుకను భారీ ఎత్తున ఆర్కే బీచ్ వైజాగ్ లో జరపాలని ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్. ఈ వేడకకు భారీగా రెండు రాష్ట్రాల్లో ఉన్న రామ్ చరణ్ అభిమానులు హాజరుకానున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ఫర్మిషన్స్ కోసం ప్రయత్నాలు, ఈవెంట్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.

ఇక హీరో రామ్‌చరణ్ గోదావరి నదిలో పడవ నడిపే ‘చిట్టిబాబు’గా నటిస్తుండగా.. హీరోయిన్ సమంత ‘రామలక్ష్మి’ అనే పేరుతో పేదింటి పిల్లగా నటిస్తున్నారనే అంచనాకు వచ్చేసారు . వీరిద్దరి ప్రేమ, పర్యవసానాలతో మూవీ తెరకెక్కుతోందని అంతా అనుకున్నారు.

అయితే ఈ చిత్రంలో ప్రేమకథతో పాటు పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కూడా ఉందనే టాక్‌ బయటకు వచ్చింది. 1985 నాటి రాజకీయాలు, అప్పుడు జరిగిన మండల స్థాయి ఎన్నికలు, వాటి ప్రభావాలు వంటి సన్నివేశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -