వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ న్యూస్ చానెల్‌పై కన్నెర్ర జేశారు. టీవీ9 చానెల్‌పై క్రిమినల్ అభియోగాలతో పలు కేసులు దాఖలు చేయనున్నట్టు ఆయన తాజాగా ట్విట్టర్లో వెల్లడించారు. ప్రస్తుతం తాను ఆ ప్రక్రియలో ఉన్నానని, తన లాయర్లు అందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారని ట్వీట్లో తెలిపిన వర్మ మరో ట్వీట్ చేశాడు.
తెలుగు టీవీ చానల్ ‘టీవీ9’పై క్రిమినల్ కేసు పెట్టనున్నట్టు ఈ ఉదయం వెల్లడించిన దర్శకుడు రాంగోపాల్ వర్మ, మరో ట్వీట్ పెడుతూ ఆ చానల్ యాంకర్ రజనీకాంత్ పై నిప్పులు చెరిగాడు. నిజాలను నాశనం చేస్తూ, ఆయన తప్పుడు వార్తా కథనాలను ప్రసారం చేయిస్తున్నారని ఆరోపించాడు.
కించపరిచే దురుద్దేశంతో టీవీ9 వాస్తవాలను వక్రీకరించి.. తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోందని, ప్రస్తుతం జరుగుతున్న విచారణ గురించి న్యూస్లీకులు ఇవ్వడం కూడా నేరమేనని, ఇందుకు టీవీ9ను చట్టప్రకారం ఎదుర్కొంటానని వర్మ పేర్కొన్నారు. టీవీ9 మూర్ఖపు కథనాలు ప్రసారం చేస్తోందని, ముంబైలోని తన 27 అంతస్తు టెర్రాస్‌లో ఆ కథనాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నానని అంతకుముందు వర్మ ట్వీట్ చేశారు. టీవీ9 పేరును టీవీ9 సర్కస్ జోకర్స్‌గా మార్చాలంటూ ఘాటుగా విమర్శించారు
అసత్యాలను ప్రసారం చేస్తూ, తనపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఓ నేరంపై విచారణ జరుగుతూ ఉండగా, ‘విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు’ అంటూ వార్తలు అందించడం కూడా నేరమేనని, అతి త్వరలో ‘టీవీ9’ భారత చట్టాలను ఎదుర్కోవాల్సి వుంటుందని హెచ్చరించాడు.
TV9 channel under Rajnikant is distorting facts and presenting false news ..spreading malicious and derogatory perceptions..it’s claims of news leaks from an ongoing investigation is a crime ..Tv 9 will be soon dealt with as per the laws of the land
— Ram Gopal Varma (@RGVzoomin) February 20, 2018
