Friday, May 3, 2024
- Advertisement -

మరో హీరోయిన్ పెళ్లికి ‘పెద్దలు ఒప్పుకొన్నారు’!

- Advertisement -

ఈ మధ్యకాలంలో బాలీవుడ్ హీరోయిన్లకు పెళ్లి కళ వస్తున్నట్టుగా ఉంది. ఒకరి తర్వాత ఒకరుగా వీరు పెళ్లి కబుర్లు చెబుతున్నారు. ప్రేమాయణాల్లో మునిగి తేలిన వీళ్లు పెళ్లి బంధంతో ఏకం కావడానికి సిద్ధం అవుతున్నారు. ఇటీవలే కత్రినాకైఫ్- రణ్ బీర్ కపూర్ల పెళ్లి గురించి వార్తలొచ్చాయి. వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకొన్నారని మొన్నటి వరకూ పుకార్లు షికార్లు చేశాయి.

మరి వారి ప్రేమ, పెళ్లి సంగతి అలా ఉంటే.. ఇప్పుడు దీపికా పదుకొనే కూడా  పెళ్లి కూతురు కాబోతోందని వార్తలు వస్తున్నాయి. రణ్ వీర్ సింగ్ ప్రేమలో ఉన్న ఆమె కూడా వివాహబంధంలోకి ఎంటరవ్వబోతోందట. ఈ మేరకు వీరి పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. 

మరి మొదట కత్రినా.. ఇప్పుడు దీపిక. తమ తమ ప్రేమబంధాలను పదిల పరుచుకొనేలా ముందుకు వెళుతున్నారు. ప్రేమలతోనే బ్రేకప్ చెప్పకుండా.. పెళ్లి వరకూ వెళుతున్నట్టున్నారు. మరి ఇవి ఒట్టి రూమర్లు మాత్రమేనా..నిజంగా ఆ పెళ్లిళ్లు జరుగుతాయా?! అనేది వేచి చూసి తెలుసుకోవాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -