Friday, May 3, 2024
- Advertisement -

20 యేళ్ల అమ్మాయిగానా! త్రిష అసలు వయసు ఎంత?

- Advertisement -

త్రిష మరో సారి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకు సిద్ధం అయ్యింది. గతంలో ఆకాశమంతా వంటి సినిమా లో లీడ్ రోల్ చేసిన త్రిష ఇప్పుడు మళ్లీ అలాంటి సినిమాకు సిద్ధం అవుతోంది. విశేషం ఏమిటంటే అందులో త్రిష ఒక ఇరవై యేళ్ల వయసున్న అమ్మాయిగా కనిపించనున్నది! అందుకోసం శారీరక కసరత్తులో మునిగిందట ఈ భామ.

ఆ పాత్ర కోసం త్రిష బరువు తగ్గనున్నదని.. ఫిజిక్ లో కూడా చాలా చైంజ్ తీసుకు వస్తోందని తెలుస్తోంది. మరి పెళ్లి ఆగిపోవడంతో.. తిరిగి సినిమాలతో బిజీ అయిపోవడంలో భాగంగా త్రిష ఇలాంటి కసరత్తులు చేస్తుండవచ్చు. 20 యేళ్ల అమ్మాయి దగ్గర నుంచి వయసు పెరుగుతూ పోయే పాత్రలో కనిపిస్తుందట త్రిష.

మరి 20 యేళ్ల అమ్మాయిలా కనిపించబోయే త్రిష అసలు వయసు ఎంత? అనేదే ఒక ప్రశ్నార్థకం. ఆమెకు తెలుగులో బాగా గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా “వర్షం” ఆ సినిమా వచ్చి ఇప్పటికే 11 సంవత్సరాలు గడిచిపోయాయి. అంతకన్నా ముందే త్రిష కొన్నితమిల సినిమాల్లో చేసింది. ‘జోడీ’ వంటి సినిమాలో కూడా హీరోయిన్ కు స్నేహితురాలి పాత్రలో కనిపిస్తుంది. ఆ సినిమా వచ్చి ఇప్పటికే దాదాపు 14 సంవత్సరాలు అవుతాయి. ఇలా ఈ విధంగా చూసుకొంటే త్రిష ఇండస్ట్రీలోకి వచ్చి 15 సంవత్సరాలు పూర్తి అవుతాయి. మరి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే సమయానికి తన వయసు ఎంతో.. కచ్చితంగా తెలిస్తే త్రిష వయసుపై ఒక అంచనాకు రావడానికి అవకాశం ఉంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -