- Advertisement -

‘రా రండోయ్ వేడుక చూద్దాం’ రివ్యూ

- Advertisement -
Rarandoi Veduka Chuddam Review

ఇప్పటివరకు నాగచైతన్య లవ్ స్టోరీ తో అదరగొట్టారు. కానీ ఇప్పుడు పస్ట్ టైం ఓ కుటుంబ కథా సినిమాలో నటించాడు. ఆ సినిమాయే.. ‘రా రండోయ్ వేడుక చూద్దాం’. అన్నపూర్ణ స్టూడియోస్‌పై నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున ఈ సినిమాని నిర్మించారు. మరి ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం..

కథ:

ఇంట్లో వాళ్లు ప్రపంచం తప్ప మరో ప్రమంచం తెలియని అమ్మాయి భ్రమరాంబ(రకుల్ ప్రీత్ సింగ్). అయితే ఈ భ్రమరాంబను శివ(నాగచైతన్య) ఓ పెళ్లిలో చూసి బాగా ఇష్టపడుతాడు. ఆ తర్వాత చదువు కోసం వైజాగ్ వస్తోంది భ్రమరాంబ. శివకూడా వైజాగ్ లోనే ఉండటంతో అతనితో భ్రమరాంబకు పరిచయం పెరుగుతుంది. భ్రమరాంబకు సీటీ తెలియకపోవడంతో శివ ఎప్పుడు భ్రమరాంబ పక్కనే ఉంటాడు. కానీ శివను ప్రేమించాలని భ్రమరాంబ అనుకోదు. తన తండ్రి ఆది(సంపత్) ఎవరిని చేసుకోమంటే వారినే చేసుకోవడానికి రెడీగా ఉంటుంది భ్రమరాంబ. అనుకోకుండా ఓ సమయంలో భ్రమరాంబకు శివ మీద ప్రేమ కలుగుతుంది. కానీ శివ తండ్రి కృష్ణ(జగపతి బాబు)కు, ఆదికి పాత గొడవలు ఉంటాయి. ఒకరంటే ఒకరికి పడదు. దీంతో ఆది తన కూతురిని కృష్ణ ఇంటికి కోడలుగా పంపడానికి ఇష్టపడడు. అసలు ఈ కృష్ణకు, ఆదికి మధ్య.. గొడవలకు కారణం ఏంటి..? చివరికి ప్రేమించుకున్న శివ, భ్రమరాంబల ఒక్కటి ఎలా అయ్యారు..? చివరకు ఏం జరిగింది..? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ విషయంకు వస్తే నాగచైతన్య, రకుల్ నటన గురించి చెప్పుకోవాలి. చాలా అద్భుతంగా వీరిద్దరు నటించారు. చైతుని ఇటువంటి వినోదబరిత పాత్ర ఇప్పటివరకు చేయలేదు. చాలా చక్కగా చేశారు. అలానే దర్శకుడు కల్యాణ్ కృష్ణ తనదైన స్టయిల్‌లో వినోదాన్ని జోడించి కొత్త స్క్రీన్‌ప్లే‌తో కథను నడిపించారు. ఫస్ట్ మొత్తం హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలతోనే ఆకట్టుకున్నాడు. అలానే సెకండ్ ఆఫ్ కి వచ్చేసరి సినిమా అసలు కథలోకి వెళ్తోంది. సెకెండ్ హాఫ్ ఆసక్తికరంగా సాగుంది. ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ప్రధానంగా సెకండ్ హాఫ్‌లో చైతు, రకుల్ మధ్య వచ్చే సన్నివేశాలు మాస్ ఆడియన్స్‌కు బాగా నచ్చుతాయి. హీరోయిన్‌తో చైతు చెప్పే డైలాగ్స్ విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక ఈ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు చైతు దగ్గరవ్వడం ఖాయం. ఇప్పటివరకు మోడర్న్ లుక్‌లో కనిపించిన రకుల్.. ఇందులో లంగావోణీల్లో అదిరిపోయింది. ఎమోషనల్ సీన్స్‌లో బాగా నటించింది. జగపతిబాబు, సంపత్ చక్కగా నటించారు. సినిమాటోగ్రఫీ వర్క్ ఆకట్టుకుంది. దేవిశ్రీ మ్యూజిక్ సినిమా స్థాయిని పెంచింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసింది. పాటలు కూడా సందర్భానుసారంగా కథలో భాగంగా ఉన్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ విషయంకు వస్తే.. ప్రధానంగా ఇద్దరు ప్రేమించుకోవడం, వారి రెండు కుటుంబాల మధ్య పాత గొడవల కారణంగా వారి ప్రేమకు పెద్ద వాళ్లు అడ్డు చెప్పడం.. ఇలాంటి కాన్సెప్ట్‌తో గతంలో చాలా సినిమాలే వచ్చాయి. దర్శకుడు కథ విషయంలో కొత్తగా చెప్పింది ఏమి లేదు. ఫస్ట్ ఆఫ్ అక్కడ అక్కడ బోరు కొట్టించాడు. జగపతి బాబు పాత్రకు పెద్దగా ఉపయోగించుకోలేకపోయారు. క్లైమాక్స్ కూడా ఉహించినట్లే జరుగుతుంది.

మొత్తంగా :

సినిమాలో నాగచైతన్య.. రకుల్ నటన.. కథానం బాగుడటం ప్లస్ పాయింట్స్ గా కనిపిస్తుండగా.. కథలో దమ్ము లేకపోవడం.. చూసిన కథనే మళ్లీ చూస్తున్న ఫీల్ కలగడం కనిపిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ మధ్యకాలంలో వచ్చిన ఓ మంచి కుటుంబ కథా చిత్రం గా ఈ సినిమని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీ సినిమాలను.. లవ్ స్టోరీలను ఇష్టపడేవారికి ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -