Saturday, May 18, 2024
- Advertisement -

ఉత్త‌ర కొరియాతో చ‌ర్చ‌ల‌కు స‌మ‌యం త‌క్కువ‌గా ఉంది

- Advertisement -
U.S. asks China don’t drag discussion with north korea

ఉత్త‌ర కొరియా దుందుడుకు స్వ‌భావం కారునంగా అంత‌ర్జాతీయంగా ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే.పెద్ద‌న్న హెచ్చ‌రించినా అణుప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తూ రెచ్చ‌గొడుతోంది.ఇప్ప‌టికే ఓపిక‌తో ఉన్న అమెరికా ఇంక ఎమాత్రం ఉపేక్షించేదుకు సిద్దంగాలేదు.ఉత్త‌ర కొరియాపై చ‌ర్య‌ల‌కు సిద్ద‌మంవుతోంది.

ఉత్తర కొరియా దుందుడుకు వైఖరిని, అణ్వస్త్ర ప్రయోగాలను చర్చల ద్వారా అడ్డుకునేందుకు చైనాకు అతి కొద్ది సమయమే మిగిలివుందని అమెరికా హెచ్చరించింది. బీజింగ్ లో ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఈస్ట్ ఆసియన్ అండ్ పరిఫిక్ అఫైర్స్ అసిస్టెంట్ సెక్రటరీ సుసాన్ థ్రాంటన్, ఉత్తర కొరియా సమస్యను చాలా త్వరతిగతిని పరిష్కరించాల్సి వుందని అన్నారు. అందుకు సమయం కూడా తక్కువగానే ఉందని, ఈలోగానే కొరియా నేతతో మాట్లాడి, అతని దూకుడుకు కళ్లెం వేయాలని సూచించారు.

{loadmodule mod_custom,Side Ad 1}

నార్త్ కొరియన్లను చర్చలకు పిలిచి మాట్లాడాల్సిన సమయం ఇదేన‌న్నారు. చాలా త్వరగా ఇది జరగాలి” అని అన్నారు. కాగా, ఇటీవలి కాలంలో డజనుకు పైగా క్షిపణి పరీక్షలను ఉత్తర కొరియా నిర్వహించిన సంగతి తెలిసిందే. తదుపరి ఇదే తరహాలో మరిన్ని పరీక్షలు నిర్వహించేందుకు కిమ్ జాంగ్ ఉన్ సైన్యం ఉత్సాహంతో ఉండగా, వారిని అడ్డుకోవాలని అమెరికా తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసింది.మ‌రి చైనా ఉత్త‌ర కొరియా విష‌యంలో ఏంచ‌ర్య‌లు తీసుకుంటుందో చూడాలి.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -