Thursday, May 16, 2024
- Advertisement -

ప‌దిహేడేళ్ల‌ప్పుడే ప్యార్‌లో ప‌డిపోయిన హీరోయిన్‌

- Advertisement -

‘తొలి ప్రేమ’ సినిమాలో న‌టిస్తున్న త‌న‌కు కూడా తొలిప్రేమలాంటి ప్రేమక‌థ ఉందని హీరోయిన్ రాశీఖ‌న్నా ప్ర‌క‌టించింది. ఈ టైటిల్ త‌న‌కు క‌నెక్ట్ అయ్యింద‌ని పేర్కొంది. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో వ‌రుణ్‌తేజ్ న‌టించిన ‘తొలి ప్రేమ’ సినిమాలో రాశీఖ‌న్నా న‌టించింది. ఈ సినిమా విడుద‌ల సంద‌ర్భంగా మీడియాతో బొద్దుగుమ్మ మాట్లాడింది. ఈ ప్రేమ ప్రతీ ఒక్కరికీ ఎదురయ్యే అనుభవం అని చెప్పింది. ఈ సంద‌ర్భంగా తన తొలిప్రేమ సంగతులు చెబుతోంది.

తన ఫస్ట్ లవ్ గురించి లీక్ చేసేసింది రాశి ఖన్నా. తాను 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ క‌ళాశాల‌లో సీనియర్ వచ్చి ప్రపోజ్ చేశాడట. అత‌డి ప్ర‌పోజ్‌కు షాక‌య్యి ఏం మాట్లాడలేకపోయిందట రాశిఖన్నా. కానీ తొలిప్రేమ భావన ఎలా ఉంటుందో అనే సంగతి మాత్రం బాగా అర్ధమయిందని పేర్కొంది. అందుకే ‘తొలి ప్రేమ’ సినిమాకు బాగా కనెక్ట్ అయిపోయినట్లుగా చెబుతోంది.

ఈ సినిమాలు మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపించనున్న రాశి ఖన్నా.. మొదటగా బరువు తగ్గి ఓ ఎపిసోడ్ చేసిందట. తర్వాత మళ్లీ కొంత బరువు పెరిగి కొంత భాగం షూటింగ్ జరుపగా.. మరోసారి ఐదు కేజీలకు పైగా బరువు తగ్గినట్లు వెల్లడించింది. ఇప్పుడు తన లుక్ అందరినీ నచ్చుతోందని.. ఇదే ఫిజిక్ ను కంటిన్యూ చేయడానికి కష్టపడతానని అభిమానులకు వాగ్దానం చేస్తోంది రాశి ఖన్నా. ఈ సినిమా కోసం రాశీఖ‌న్నా బాగా క‌ష్ట‌ప‌డింది. త‌న‌కు విజ‌యాలు లేక‌పోవ‌డంతో ఈ సినిమాపై ఆశ పెట్టుకుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -