ఇప్పటికే ఒక సారి ‘జిల్’ మనిపించారు గోపిచంద్, రాశిఖన్నాలు. ఇప్పుడు మరోసారి ఈ జంట కనువిందు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. “ఊహలుగుసగుసలాడే’ సినిమాతో తెలుగుకు పరిచయం అయిన భామ రాశిఖన్నా. ఆ సినిమా సెన్సిబుల్ హిట్ గా నిలవడంతో టాలీవుడ్ ఈ అమ్మాయిపై దృష్టిపెట్టింది.
ఒకదాని తర్వాత మరోటి అన్నట్టుగా తనకు వరసగా అవకాశాలు దక్కసాగాయి. ప్రస్తుతం ఈ భామకు చేతినిండా సినిమాలున్నాయి. అలాగే కొన్ని హిట్ సినిమాలు కూడా తన సొంతమయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో రాశి లక్కీ హ్యాండ్ అనిపించుకొంటోంది. ప్రత్యేకించి సరైన హిట్ కోసంఎదురుచూస్తున్న హీరోలు రాశిని తమ సినిమాల్లో అట్టేపెట్టుకోవడానికి ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.
ఇలాంటి వారిలో గోపిచంద్ ఒకరు. ఇప్పటికే ఒక సినిమా లో గోపితో కలిసి నటించింది రాశి. ఇప్పుడు మళ్లీ ఈ జంట కనువిందు చేయబోతోందట. గోపిచంద్ తర్వాతి చిత్రంలో కూడా రాశినే హీరోయిన్ అని సమాచారం. మొత్తానికి ఈ మధ్యకాలంలో ఇంత త్వరగా రెండో సారి పెయిరప్ అవుతున్న జంట వీళ్లదే. ప్రస్తుతం అయితే రాశి “బెంగాల్ టైగర్” తో తెరపైకి రానుంది.