Wednesday, May 1, 2024
- Advertisement -

కాస్టింగ్ కౌచ్ గురించి ప‌చ్చిగా మాట్లాడిన ‘యాంక‌ర్ ర‌ష్మీ’

- Advertisement -

కాస్టింగ్ కౌచ్ …తెలుగు ఇండ‌స్ట్రీని కొంత‌కాలంక్రితం షేక్ చేసిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే.వివాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి తెలుగు ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంద‌ని,సినిమాల‌లో అవ‌కాశాలు కోసం ఇక్క‌డ ప‌డుకోవ‌ల‌ని చెప్పి సంచ‌ల‌నానికి తెర లేపింది. శ్రీరెడ్డి ఇండస్ట్రీ పెద్దలపై సంచలన ఆరోపణలు చేయడం పలు వివాదాలకు దారి తీసింది. నిర్మాత సురేష్ బాబు కొడుకు అభిరామ్ త‌నకు అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని చెప్పి లైంగికంగా వాడుకున్నాడ‌ని చెప్పి పెద్ద వివాద‌మే సృష్టించింది శ్రీరెడ్డి.కాస్టింగ్ కౌచ్ పై ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు స్పందించారు. కొందరు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందంటే.. మరికొందరు మాత్రం తమకు అలాంటి అనుభవాలు ఎదురుకాలేదని అన్నారు.

తాజాగా తెలుగు యాంక‌ర్ ర‌ష్మీ కాస్టింగ్ కౌచ్‌పై సంచ‌ల‌న‌ కామెంట్స్ చేసింది.ర‌ష్మీ తాజాగా నటించిన అంత‌కు మించి సినిమా ప్ర‌మోషన్స్‌లో భాగంగా ఆమె ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతు…కాస్టింగ్ కౌచ్‌ను నేను గౌరవిస్తాను కూడా. కెరీర్ బాగుందనిపిస్తే.. కాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పడంలో తప్పు లేదు. ఇద్దరి అంగీకారంతో జరిగేది అది. ఇది ఎవరికివారి పర్సనల్ విషయం. సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదు.ప్రతీ చోట కాస్టింగ్ కౌచ్ ఉంది.దీన్ని ఇంత పెద్దదిగా చేసి చూడాల్సిన అవసరం కూడా లేదు” అంటూ చెప్పుకొచ్చింది. ఇక్క‌డ ఎవ‌రు ఎవ‌ర్ని బ‌ల‌వంతం చేయ‌రు.ప్రతీ విషయంలో నో చెప్పే ఆప్షన్ ఒకటి ఉంటుంది కదా,మ‌న ప్ర‌వ‌ర్త‌న బ‌ట్టే ఎదుటి వారి ప్ర‌వ‌ర్తిస్తారంటు చెప్పుకొచ్చింది ర‌ష్మీ.దీనిని బట్టి చూస్తే ర‌ష్మీ కాస్టింగ్ కౌచ్‌కు మ‌ద్ద‌తు తెలిపినట్లే అని కొంద‌రు భావిస్తున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -