Sunday, May 5, 2024
- Advertisement -

కొడుకు పంచ్‌కు పడిపోతున్న ఎన్టీఆర్

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమాలలో విల‌న్స్‌ని దుమ్ములేపుతుంటాడు.కాని ఇక్క‌డ నిజం జీవితంలో మాత్రం కొడుకు అభ‌య్ రామ్ ఇచ్చే పంచ్‌ల‌కు త‌ట్టుకోలేక‌పోతున్నాడు.తాజాగా ఎన్టీఆర్ త‌న కొడుకు అభ‌య్ రామ్‌తో స‌రదాగా ఆడుకుంటున్న వీడియోని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు.ఈ వీడియోలో అభయ్ తన తండ్రి ముందు కూర్ని చెంపలు వాయిస్తూ కనిపించాడు.’నా కుమారుడికి నేను పంచింగ్ బ్యాగ్ అయిపోయా’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు తారక్.కరాటే కిడ్ అని హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చాడు ఎన్టీఆర్‌.దీని బట్టి అభయ్ కరాటే నేర్చుకుంటున్నట్లు ఉన్నాడు.

మొత్తానికి అభయ్ తన తండ్రికి పంచ్ లు ఇస్తూ కనిపించిన ఈ వీడియో తారక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో అర‌వింద స‌మేత అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను వ‌చ్చే ద‌స‌రాకు విడుద‌ల చేయాలడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా పూజా హెగ్డె,ఈషా రెబ్బాలు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌కు సూప‌ర్ రెస్ప‌న్స్ వ‌చ్చింది.త్వ‌ర‌లోనే రెండో టాజ‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -