కన్నడ బ్యూటీ చలో సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచియం అయింది. అంతకముందు కన్నడ కిర్రాక్ పార్టీలో నటించి తొలి హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ భామపై తెలుగు దర్శక- నిర్మాతల కన్ను పడింది.చలో సినిమాతో తెలుగులో కూడా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమె నటించిన మూడు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండతో నటించిన గీతా గోవిందం సినిమాలో తన నటనతో అందరి దృష్టి ఆకర్షించింది రష్మిక. తాజాగా రష్మిక నటించిన కన్నడ సినిమా యజమాన ఈ రోజే ప్రేక్షకుల ముందుకువచ్చింది.
కన్నడలో కేజీఎఫ్ తరువాత అంతటి భారీ స్థాయిలో విడుదల అయిన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఫుల్ కమర్షియల్‌గా తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక పాత్ర పెద్దగా ఏమి లేకపోయినప్పటికి ఉన్నంతలో మెప్పించింది. ఈ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది రష్మిక. ఇలా రష్మిక నటించిన సినిమాలు అన్ని వరుసగా హిట్ అవుతుండటంతో లక్ అంటే ఈ భామదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. రష్మిక ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తుంది.
- Advertisement -
లక్ అంటే రష్మికదే
- Advertisement -
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -