Saturday, April 27, 2024
- Advertisement -

ప్రయోగానికి దగ్గరవుతున్న రష్మిక!

- Advertisement -

డియర్ కామ్రేడ్ సినిమా లో పోషించిన లిల్లీ పాత్ర కి రష్మిక కి చాలా ప్రశంసలు దక్కాయి. రష్మిక కి అనుకోకుండా నే ఊహించని విధం గా రివ్యూస్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ప్రస్తుతం రష్మిక చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే చేతి నిండా సినిమాల తో రష్మిక తెలుగు లో బిజీ గా గడుపుతున్న నేపథ్యం లో తమిళం లో కూడా కార్తీ సరసన ఒక సినిమా ఒప్పుకుంది ఈ భామ.అయితే ఇంక కొత్త సినిమాలు ఇప్పుకోవడానికి వీల్లేకుండా ఉంది కానీ ఇటీవలే రష్మిక విన్న కథ ఒకటి తనని ఎంతగానో ఆకర్షితురాలిని చేసిందట.

వివరాల్లోకి వెళితే, రష్మిక కి ఒక యువ దర్శకుడు హారర్ కథాంశం ఆధారం గా ఒక సబ్జెక్టు వినిపించాడట. ఈ సినిమా ని ఎలాగైనా చేయాలి అనే సంకల్పం తో రష్మిక ముందుకు వెళ్తుందట. ఈ సినిమా కథ పూర్తిగా ఇప్పటి వరకు వచ్చిన హారర్ సినిమాలకి భిన్నం గా ఉంటుందట. ఇది తెలుగు తో పాటు మిగిలిన భాషల్లో కూడా వర్క్ అవుట్ అయ్యే అవకాశం ఉంది అని, కచ్చితంగా సినిమా ని చేసి తీరాలి అని రష్మిక నిర్ణయించుకుందని టాక్.

కమర్షియల్ హీరోయిన్ గా ఒక రేంజ్ కి ఎదిగిన రష్మిక ఈ పరిస్థితుల్లో ప్రయోగం చేయడం ఎంత వరకు కరెక్ట్ అని తను ఆలోచించుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -