Tuesday, May 14, 2024
- Advertisement -

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎయిడ్స్ కలకలం….ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు

- Advertisement -

రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఎయిడ్ష్ మహమ్మారి తీవ్ర కలకలం రేపుతోంది. రోజురోజుకు ఎయిడ్స్ వ్యాధి బారినపడిన ఖైదీల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దాదాపు 27 మంది ఖైదీలకు ఈ వ్యాధి సోకినట్లు తెలుస్తోంది. ఈవిషయంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. తక్షణమే వారికి జరిపించిన వైద్య పరీక్షల నివేదికలను కోర్టుకు అప్పగించాలని ఆదేశించింది. వారిలో ఏ ఒక్కరికైనా జైలుకు వచ్చిన తరువాత హెచ్ఐవీ సోకినట్టుగా నిర్దారణ అయితే, జైలు సూపరింటెండెంట్ పై అత్యంత కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది

జైల్లోకి రాకముందే 19 మందికి ఎయిడ్స్ వ్యాధి బాధితులు ఉంటే ప్రస్తుతం వారి సంఖ్య 27కి పెరిగిందని జైళ్ల శాఖ స్పష్టం చేసింది. ఇటీవల రాజమండ్రి జైలులో ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించగా, వారిలో 27 మందికి ప్రాణాంతక వైరస్ సోకినట్టు వెల్లడైంది. దీంతో జైలు అధికారులు సైతం తీవ్ర ఆందోళనకు లోను కావడంతోపాటు బంధువులు హైకోర్టును ఆశ్రయించారు.

జైల్లో 27 మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారని జైళ్లశాఖ తరపు న్యాయవాది స్పష్టం చేశారు. మెుత్తం జైల్లో ఎంతమంది ఖైదీలు ఉన్నారని హైకోర్టు ఆరా తీయగా మెుత్తం 1500 మంది ఖైదీలు ఉన్నారని తెలిపింది. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఎలాంటి చికిత్స అందిస్తున్నారో వివరాలతో సహా విచారణకు హాజరుకావాలని జైళ్ల సూపరింటెండెంట్ ను ఆదేశించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -