Saturday, May 4, 2024
- Advertisement -

మ‌హేశ్ బాబు సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ర‌ష్మిక‌

- Advertisement -

క‌న్న‌డ బ్యూటీ చ‌లో సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ప‌రిచియం అయింది. అంత‌క‌ముందు క‌న్న‌డ కిర్రాక్ పార్టీలో న‌టించి తొలి హిట్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ భామపై తెలుగు ద‌ర్శ‌క‌- నిర్మాత‌ల క‌న్ను ప‌డింది.చ‌లో సినిమాతో తెలుగులో కూడా గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమె న‌టించిన మూడు సినిమాలు సూప‌ర్ హిట్లుగా నిలిచాయి. ముఖ్యంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో న‌టించిన గీతా గోవిందం సినిమాలో త‌న న‌ట‌న‌తో అంద‌రి దృష్టి ఆక‌ర్షించింది ర‌ష్మిక‌. ప్ర‌స్తుతం ఈ భామ విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి డియ‌ర్ కామ్రేడ్ సినిమాలో న‌టిస్తోంది. తాజాగా ర‌ష్మిక ల‌క్కీ చాన్స్ కొట్టేసిన‌ట్లే క‌నిపిస్తోంది.

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు న‌టించే కొత్త సినిమాలో హీరోయిన్‌గా ర‌ష్మిక‌ను ఎంపిక చేసిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌హ‌ర్షి సినిమా త‌రువాత సుకుమార్‌తో మ‌హేశ్ ఓ సినిమా చేయల్సి ఉంది. అనుకోని కార‌ణల వ‌ల్ల సుకుమార్‌తో సినిమా క్యాన్సిల్ అయింది. దీంతో అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ సందీప్ వంగాతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మ‌హేశ్ బాబుకు జోడీగా ర‌ష్మిక‌ను తీసుకుంటార‌ని స‌మాచారం. సందీప్ వంగాతో కాకపోయిన అనిల్ రావిపూడితో అయిన సినిమా చేయ‌డానికి మ‌హేశ్ రెడీ అవుతున్నాడు. ద‌ర్శ‌కుడు ఎవ‌రైన హీరోయిన్ మాత్రం ర‌ష్మిక‌నే తీసుకోనున్నార‌ట‌. మొత్త‌నికి సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌తో ల‌క్కీ ఛాన్స్ కొట్టేసింద‌ని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -