Wednesday, April 24, 2024
- Advertisement -

అసిస్టెంట్ లై నెత్తిమీద ఎక్కిన్చుకుంటున్నారు

- Advertisement -

కాదేదీ సినిమా తీయడానికి అనర్హం అన్నట్టుగా హీరో రవిబాబు ఏకంగా ఒక పందిపిల్లతో సినిమాకి ఓకే అన్నాడు. ఓకే అనడం ఏంటి షూటింగ్ కూడా పూర్తి చేసి విడుదల కి సిద్దం అవుతున్నాడు రవి బాబు.

బయట చాలా సాధారణ జీవిత శైలి కి అలవాటు పడిన రవి బాబు ఆదివారం నాడు చికెన్ షాప్ కి వెళ్లి కూడా అతను ఒక్కడే చికెన్ కొంటాడు అట , ఎంత దూరమయినా షూటింగ్ తరవాత తానే స్వయంగా కారు నడుపుతాడు , ఇదెక్కడి సింప్లిసిటీ బాబూ అని అడిగితే ఇండస్ట్రీ లో పని చెయ్యడం వలన అందరికీ అసిస్టెంట్ ల పిచ్చి ఏర్పడింది అని చెప్పుకొచ్చారు ఆయన. ” ప్రతీదానికీ అసిస్టెంట్లను పెట్టేసి.. మనల్ని బాగా గారాబం చేస్తున్నారు. దాని వలన తరువాత ఈ అసిస్టెంట్లు ఎవరూ చుట్టూ లేనప్పుడు మనకు ఇబ్బంది కలుగుతోంది.

రియాల్టీని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. అందుకే నేను అసిస్టెంట్లను మెయిన్టయిన్ చేయను. నా కారు నేనే డ్రైవ్ చేసుకుంటా. నా పనులు నేనే చేసుకుంటా. కాకపోతే ఒక మేకప్ కుర్రాడిని మాత్రం పెట్టుకున్నా. ఎందుకంటే నాసిరకం మేకప్ కిట్ వాడితే మన స్కిన్ పాడవుతుంది. సో.. అక్కడ మాత్రం టచ్ అప్ కోసం ఒకరిని పెట్టుకోక తప్పట్లేదు” అంటూ సెలవిచ్చాడు రవిబాబు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -