Thursday, April 25, 2024
- Advertisement -

వాళ్ల‌కు వెటకారం ఎక్కువ – ర‌వితేజ‌

- Advertisement -

మాస్ రాజా ర‌వితేజ ,శ్రీనువైట్ల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం అమ‌ర్ అక్బ‌ర్ అంటొని. ఇలియానా హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శ‌నివారం హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది.ఈ సంద‌ర్భంగా ర‌వితేజ మాట్లాడుతు ‘‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’కి డబ్బింగ్‌ చెప్పేటప్పుడు విపరీతంగా నవ్వాను.. అంత ఎంజాయ్‌ చేశాను. తమన్‌తో ఇది 9వ సినిమా. నెక్ట్స్‌ పదో సినిమా. హిట్‌కి, ఫ్లాప్‌కి సంబంధం లేకుండా నాకు ఎప్పుడూ సూపర్‌ హిట్‌ మ్యూజిక్‌ ఇస్తాడు. తమన్‌.. మనం ఇలాగే కంటిన్యూ అవ్వాలి. నవీన్, రవి, మోహన్‌గార్లు సైలెంట్‌గా ఉన్నా వెటకారం ఎక్కువ. వీరితో ఎన్ని సినిమాలు చేయడానికైనా నేను రెడీ. అంతమంచి ప్రొడక్షన్‌ హౌస్‌ ఇది.

ఇలియానా.. ఇంతకు ముందు చెప్పాను.. ఇప్పుడూ చెబుతున్నా.. షీ ఈజ్‌ డార్లింగ్‌. మనం మళ్లీ పని చేస్తాం. శ్రీను వైట్ల కామెడీ, సెన్సాఫ్‌ హ్యూమర్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎప్పుడూ సూపర్‌గానే ఉంటుంది. తను గొప్ప నటుడు. అతను చేసి చూపించినదాంట్లో మనం 50 శాతం చేస్తే చాలు విపరీతమైన పేరొస్తుంది. ఇలియానా మాట్లాడుతూ– ‘‘మిమ్మల్ని (ప్రేక్షకులు) చాలా మిస్‌ అయ్యాను.. మళ్లీ వెనక్కి వచ్చాను.. చాలా సంతోషంగా ఉంది.. లవ్‌ యూ. ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ చిత్రంలో తొలిసారి డబ్బింగ్‌ చెప్పాను. మీకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. నన్ను నమ్మినందుకు శ్రీనుగారికి థ్యాంక్స్‌. రవిగారితో పనిచేయడం చాలా సరదాగా ఉంటుంది. తను రియల్లీ గుడ్‌ ఫ్రెండ్‌. తనతో చాలా చాలా సినిమాలు చేయాలనుకుంటున్నా. తమన్‌ చక్కని పాటలు ఇచ్చారు’’ అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -