Monday, May 6, 2024
- Advertisement -

ర‌వితేజ ‘అమ‌ర్ అక్బ‌ర్ అంటోని’ టీజ‌ర్(వీడియో)

- Advertisement -

మాస్ రాజా ర‌వితేజ వ‌రుస ఫ్లాప్‌ల‌ను ఎదుర్కొంటున్నాడు.ర‌వితేజ‌కు ఇటీవ‌ల కాలంలో రాజా ది గ్రేట్ హిట్ త‌ప్ప మ‌రో హిట్ లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో అమ‌ర్ అక్బ‌ర్ అంటోని సినిమా చేస్తున్నాడు.అటు ర‌వితేజ‌,ఇటు శ్రీనువైట్ల ఇద్ద‌రు ప్లాప్‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్నారు. రవితేజ కథానాయకుడిగా మూడు విభిన్న పాత్రలతో తెర‌కెక్కుతుంది అమర్ అక్బర్ అంథోని.నేడు శ్రీను వైట్ల పుట్టినరోజు సందర్బంగా చిత్ర యూనిట్ పివోట్ పేరుతో ఒక టీజర్ ను రీలిజ్ చేసింది. టీజ‌ర్‌ను చూస్తుంటే అమర్ – అక్బర్ – అంథోని పాత్రలను విజువల్ గా ఆకట్టుకునే విధంగా తెరక్కించారని అర్ధమవుతోంది.

మొదటి పాత్రలో రవితేజ అమెరికన్ జైల్లో ఖైదీగా కనిపిస్తున్నాడు. టీజ‌ర్‌ను ఆక‌ట్టుకునే విధాంగా తెర‌కెక్కించారు అన‌డంలో సందేహం లేదు.మరి ఈ సినిమా రవితేజ – శ్రీను వైట్ల కాంబినేషన్ కు ఎలాంటి విజయాన్ని ఇస్తుందో చూడాలి. ఇక ఇలియానా సినిమాలో కథానాయిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను సంక్రాంతికి విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -