Wednesday, May 8, 2024
- Advertisement -

అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా రిలీజ్‌కు బ్రేక్‌…?

- Advertisement -

శ్రీను వైట్ల దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సినిమా అమర్ అక్బర్ ఆంటోని. ఈ సినిమాలో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి కావడానికి వచ్చిందట. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలైందని సమాచారం.

రవితేజ మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనున్నట్టు ఇంతకుముందు ప్రకటించారు. అయితే ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు రావడం లేదనే వార్త ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది.

న్ని కారణాల వలన ఆ రోజున ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనను విరమించుకున్నారని సమాచారం. డిసెంబర్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. దసరా రోజుల్లో వస్తోన్న సినిమాల సంఖ్య ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమనేది ఫిల్మ్ నగర్లో వినిపిస్తోన్న టాక్. ఇది ర‌వితేజ అభిమానుల‌కు కొంత నిరాశ క‌లిగించే విష‌యం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -