- Advertisement -

మళ్లీ రవితేజతో తమన్నా!

- Advertisement -

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ఇరుముడి. ఈ సినిమాను దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదలైనప్పటి నుంచే ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది.

తాజా సమాచారం ప్రకారం, మిల్కీ బ్యూటీ తమన్న బాటియాను ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రబృందం ఆమెతో చర్చలు కూడా ప్రారంభించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో తమన్నా మరియు రవితేజ కలిసి బెంగాల్ టైగర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి నటించే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక భవనీ శంకర్ నటిస్తోంది. అలాగే బాలనటి బేబి నక్షత్ర రవితేజ కూతురి పాత్రలో కనిపించనుంది. కుటుంబ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ కథతో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. సంగీతాన్ని జీవీ ప్రకాష్ కుమార్ అందిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -