- Advertisement -

ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్‌లో మోనాలిసా

- Advertisement -

కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయి ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన మోనాలిసా తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. తనకు మరియు తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌కు రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె కేరళలోని తిరువనంతపురం థంపనూర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది.

మోనాలిసా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించడం లేదని, అందువల్ల భద్రత కల్పించాలని కోరింది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఫర్మాన్ ఖాన్‌తో గత ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్నట్లు ఆమె తెలిపింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ కుటుంబ సభ్యులు దీనికి వ్యతిరేకంగా ఉన్నారని పేర్కొంది.

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే మోనాలిసా తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించారు. ఇరు కుటుంబాల మధ్య మాట్లాడించి పరిస్థితిని చర్చించారు. యువజంట భద్రతపై కూడా పోలీసు అధికారులు హామీ ఇచ్చినట్లు సమాచారం.

కుంభమేళా సమయంలో పూసలు అమ్ముకుంటూ ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మోనాలిసా ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. సాధారణ అమ్మాయిగా ఉన్న ఆమె ఒక్కసారిగా సెలబ్రిటీగా మారింది. ఇప్పుడు ఆమె వ్యక్తిగత జీవితం, ప్రేమ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -