Monday, May 20, 2024
- Advertisement -

అల్లు అర్జున్ సినిమా నుంచి వైదొలిగిన రావు రమేష్

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి మూడో సారి ఒక సినిమా తో మన ముందుకు రానున్నారు. ఈ సినిమా లో మంచి తారగానమే ప్రేక్షకులకి కనిపించనుంది. టబు ఈ సినిమా లో ఒక ముఖ్య పాత్ర చేయనుండగా, యువ కథానాయకులు నవదీప్, సుశాంత్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా లో రావు రమేష్ ని ఒక ముఖ్య పాత్ర కోసం తీసుకున్నారట దర్శక నిర్మాతలు. అయితే ఆయన ఇచ్చిన డేట్స్ ని సరిగా వాడుకోలేకపోవటం వలన ఇప్పుడు ఆయన డేట్స్, మహేష్ బాబు తో వస్తున్న సరిలేరు నీకెవరు తో క్లాష్ అవుతుందట.

చేసేది ఏమి లేక రావు రమేష్ మహేష్ బాబు సినిమా వైపు మొగ్గు చూపడం తో ఇప్పుడు బన్నీ చిత్ర యూనిట్ రావు రమేష్ స్థానం లో అమృతం సిరియల్ తో పాపులర్ అయిన హర్షవర్ధన్ ని తీసుకున్నారట. అయితే అసలే సినిమా మీద నెగటివ్ బజ్ ఉన్న నేపథ్యం లో ఇప్పుడు ఈ కొత్త వార్త సినిమా యూనిట్ ని కాస్త మరింత ఇబ్బంది పెట్టె అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -