Friday, May 3, 2024
- Advertisement -

ప్రస్తుత కోచ్ కే మద్దతు తెలిపిన కెప్టెన్ విరాట్ కోహ్లీ..

- Advertisement -

టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానించింది బీసీసీఐ. అనేక మంది ప్రముఖులు రేసులో ఉన్నారు. ప్రస్తుతం కోచ్ గా ఉన్న రవిశాస్త్రే మరోసారి కోచ్ గా ఎపంకి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా కోహ్లీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. వెస్టిండీస్ పర్యటన కోసం ముంబయి నుంచి సోమవారం రాత్రి బయల్దేరే ముందు మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లీ.. జట్టులో విభేదాలతో పాటు మిడిలార్డర్‌ వైఫల్యం, హెడ్ కోచ్ ఎంపికపై తన అభిప్రాయాలు వెల్లడించాడు. జట్టు ప్రధాన కోచ్‌గా మళ్లీ రవిశాస్త్రినే రావాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆకాంక్షించాడు.

రోహిత్, నామధ్య ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఇక నెం.4‌లో నిలకడగా ఆడే బ్యాట్స్‌మెన్‌ కోసం ఎదురుచూస్తున్నామని.. టాప్ ఆర్డర్‌ మెరుగ్గా ఆడుతుండటంతో మిడిలార్డర్‌ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోహ్లీ వెల్లడించాడు. కోచ్ రవిశాస్త్రితో టీమ్‌కి సమన్వయం చాలా బాగుంది. కాబట్టి.. అతడ్నే మళ్లీ కోచ్‌గా ఎంపిక చేస్తే బాగుంటుంది. అయితే.. హెడ్ కోచ్‌ ఎంపిక తుది నిర్ణయం తీసుకోవాల్సింది బీసీసీఐ పాలకుల కమిటీ. ఇప్పటి వరకు కోచ్ పై తనను ఎవరూ సంప్రదించలేదని….సంప్రదిస్తే తన అభిప్రాయాన్ని చెబుతానన్నారు కోహ్లీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -