ఈ మధ్య టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆలోచనలు చాలానే మారాయి.తెలుగు సినిమాలు ప్రస్తుతం అడల్ట్ కంటెంట్ సినిమాలకు తెలుగులో మంచి ఆధారణ లభించడంతో ,అలాంటి సినిమాలు చాలానే తెరకెక్కుతున్నాయి.అర్జున్ రెడ్డి,ఆర్ఎక్స్ 100,ఏడు చేపల కథ వంటి సినిమాల కోవలకే వస్తోంది ‘రాయలసీమ లవ్ స్టోరీ’ సినిమా.ఒక్క పోస్ట్‌ర్‌తో సినిమా ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పేశారు.వెంకట్ , హృశాలి గోసవి జంటగా ఏ వన్ ఎంటర్ టైన్ మెంట్స్ మూవీస్ పతాకంపై నూతన దర్శలకుడు రామ్ రణధీర్రూపొందించిన చిత్రం ‘రాయలసీమ లవ్ స్టోరీ’.
పంచ లింగాల బ్రదర్స్ రాయల్ చిన్నా – నాగరాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగినీడు , నల్లవేణు , పృథ్వీ , జీవా , తాగుబోతు రమేష్ , అదుర్స్ రఘు , గెటప్ శ్రీను , మధుమణి ,మిర్చి మాధవి ,జబర్దస్త్ కొమరం ,రాజమౌళి , సన్నీ , భద్రం , ప్రసన్న కుమార్ తదితరులు నటించిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని , మోషన్ పోస్టర్ ని దర్శకులు జి . నాగేశ్వర్ రెడ్డి రిలీజ్ చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందజేశారు .
