Saturday, May 18, 2024
- Advertisement -

ప్రభాస్-నిహారిక మ్యారేజ్…… నేషనల్ మీడియాలో న్యూస్ హల్చల్

- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ ప్రభాస్ మ్యారేజ్ గురించి ఇప్పటికే చాలా రూమర్స్ వినిపించాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కతో ప్రభాస్ ప్రేమాయణం అంటూ చాలానే వార్తలు వినిపించాయి. ఇక ప్రభాస్‌తో ఫలానా అమ్మాయి పెళ్ళి అంటూ చాలానే డిస్కషన్స్ నడిచాయి.

అయితే ఈ సారి మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా ప్రభాస్-నిహారిక మ్యారేజ్ అంటూ నేషనల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. జాతీయస్థాయిలో డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో పెద్ద పెద్ద కుటుంబాల పెళ్ళిళ్ళూ అన్నీ కూడా మల్టిపుల్ యాంగిల్స్‌లో లాభాలు ఉండేలా జరుగుతున్నాయి. రాజకీయాల్లో కూడా మెగా-రెబల్ ఫ్యామిలీలు చురుకైన పాత్ర పోషిస్తున్నాయి. ఈ రెండు కుటుంబాలు కలిస్తే గోదావరి జిల్లాల వరకూ ఆ ప్రభావం మామూలుగా ఉండదు అనడంలో సందేహం లేదు. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా రెండు కుటుంబాలకు చాలానే ప్లస్ అవుతుంది. అన్నింటికీ మించి చిరంజీవి-కృష్ణంరాజులకు మనవూరి పాండవులు సినిమాకు ముందు నుంచే మంచి సాన్నిహిత్యం ఉంది. ఇలాంటి అన్ని అంశాలు బేరీజు వేసుకుని చూస్తే మాత్రం ప్రభాస్-నిహారిక పెళ్ళి అంటూ జాతీయ మీడియాలో వస్తున్న వార్తలను పూర్తిగా కొట్టిపారేయలేని పరిస్థితి. అన్నింటికీ మించి పెళ్ళి వార్తను ముందుగా జాతీయ మీడియాకు అధికారికంగా లీక్ చేశారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బాహుబలి సినిమాతో ప్రభాస్‌కి జాతీయ స్థాయిలో క్రేజ్ వచ్చిన నేపథ్యంలో ముందుగా జాతీయ మీడియాకు లీకులు ఇచ్చారన్నది ఒక విశ్లేషణ. ప్రస్తుతానికి అయితే ఈ పెళ్ళి వార్తను గాసిప్‌గానే చూడాలి. మెగా ఫ్యామిలీ నుంచో రెబల్ ఫ్యామిలీ నుంచో వివరణ వచ్చేవరకూ వేచి చూస్తే తప్ప నిజానిజాలు ఎవ్వరికీ తెలియని పరిస్థితి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -