Thursday, May 2, 2024
- Advertisement -

చిరు 150లో స్పెషల్ సాంగ్ లో ఆ హీరోయిన్!

- Advertisement -

మెగా అభిమానులు ఎంతగానో చిరంజీవి 150వ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఇటివలే ఈ సినిమా లాంచనంగా ప్రారంభమైనది. ఈ సినిమా అలా స్టార్ట్ అయిందో లేదో అప్పుడే ఈ చిత్రంపైన గాసిప్స్ రావడం మొదలు అయింది. ఈ చిత్రానికి సంబంధించి ఇంక హీరోయిన్ ఎవరు అనేది ఇంక డిసెడ్ కాలేదు. పలువురి టాప్ హీరోయిన్స్ పేర్లు వినిపిస్తున్న ఇంక ఎవరు చిరు పక్కన నటిస్తున్నారు అనేది ఖరారు కాలేదు.

తాజాగా  హీరోయిన్ రెజీనా పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే రెజీనా హీరోయిన్ కాదని.. ఓ స్పెషల్ సాంగ్ కోసం ఆమెను తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. 150వ సినిమాకు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ ఖరారయిన తర్వాత హీరోయిన్ ఎవరనే విషయమై ఓ క్లారిటీ వస్తుందని….చిరంజీవికి సూటయ్యే ఇద్దరు ముగ్గురు హీరోయిన్లలో ఏ హీరోయిన్ డేట్స్ అడ్జెస్ట్ అయితే వారినే తీసుకోవాలని అనుకుంటున్నారట. తమిళంలో సూపర్ హిట్టయిన ‘కత్తి’ చిత్రాన్ని తెలుగులో చిరంజీవితో రీమేక్ చేస్తున్నారు.

వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగిన విధంగా మార్పులు, చేర్పులు చేసారు. చిరంజీవి కెరీర్లో ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో ఈ సినిమా కోసం రామ్ చరణ్ నిర్మాత అవతారం ఎత్తాడు. ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ స్థాపించారు. ప్రస్తుతం చిరంజీవి సినిమాలో పాత్రకు తగిన విధంగా సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఆయన బరువు తగ్గేందుకు నిపుణుల సమక్షంలో కసరత్తులు చేస్తున్నారు. జూన్ నెలలో సినిమా సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -