మొదటి నుంచి అయిన పవన్ చాలా సింపుల్ గా నడుచుకోవడం అలవాటు. అయితే తాజా పవన్ ముఖ్య అతిధిగా అ..ఆ ఆడియో వేడుకకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆడియో వేడుకకు వచ్చిన పవన్ తన చేతికి ఓ వాచ్ పెట్టుకొని వచ్చారు. ఆ వాచ్ చూడటానికి మాములుగా ఉన్న ఆ వాచ్ ఖరీదు తేలుస్తే షాక్ అవుతారు.
సాధారణంగా హంగులు, ఆర్భాటాలకు దూరంగా ఉండే పవన్ చేతికి ఉన్న వాచ్‍ని చూసి పవన్ అభిమానులు పవన్ వాచ్ పై ఆరా తీయడం మొదలు పెట్టారు. ఆ వాచ్ గురించి తెలిసిన తర్వాత అందరికి అవాక్కయే నిజం తెలిసింది. ఈ వాచ్ బ్రెంట్లింగ్ బర్నాటో కంపెనీకి చెందిన వాచ్‍గా దీని విలువ దాదాపు 5000 డాలర్లు అంటే అక్షరాల రూ. 3.82 లక్షలు అని తెలిసింది.
దీంతో పవన్ వాచ్ సర్వాత్రా హాట్ టాపిక్ అయింది, గతంలో పవన్ లాగే మహేష్ పెట్టుకున్న వాచ్ పై కూడా ఇలాంటి ఫోకస్ చేస్తే అది కూడా లక్షల విలువ చేసే వాచ్‌గా గుర్తించారు. తాజాగా ఇప్పుడు పవన్ వంతు వచ్చింది. ఎప్పుడు పవన్ వినియోగించే వస్తువులపై యూత్‍లో ఒక క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు యువత ఫోకస్ అంతా పవన్ పెట్టుకున్న ఆ వాచ్ పైనే పడింది. దీని బట్టి చూస్తే అత్తారింటికి దారేది మూవీలో సమంత చెప్పిన “తన చెతి వాచ్ అమ్మితే మీ బ్యాచ్ లైఫ్ సెట్ అయిపోతుంది.” అనే మాటలు గుర్తొస్తాయి.
