Sunday, May 26, 2024
- Advertisement -

ల‌క్కీ ఛాన్స్ కొట్టేసిన రెజీనా

- Advertisement -

హీరోయిన్ రెజీనా తెలుగులో ఎందుక‌నో అనుకున్నంత సక్సెస్ కాలేదు.వ‌ర‌స సినిమాలు అయితే చేసింది కాని హిట్లు మాత్రం రాలేదు.దాదాపు తెలుగులో అంద‌రి కుర్ర హీరోల‌తో క‌ల‌సి ప‌ని చేసింది రెజీనా.తెలుగు తెర మీద ఎంత అందాలు ఆర‌బోసిన ఆమెను ఎవ‌రు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.దీంతో రెజీనా కోలీవుడ్ బాట ప‌ట్టింది.అక్క‌డ వ‌ర‌స సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంది రెజీనా.తాజాగా ఆమె మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. తమిళంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో అరవిందస్వామికి జోడీగా రెజీనాను ఎంపిక చేశారు.

వచ్చే నెల మొదటి వారంలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. షూటింగ్ మొత్తం చెన్నైలోనే జరగనుంది.’ఎన్నమో నడక్కుదు’, ‘అచ్చమిండ్రి’ సినిమాల ఫేమ్ రాజపాండి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో అరవిందస్వామికి జోడిగా రెజీనా న‌టిస్తుంది.ఇక త‌న సెకండ్ ఇన్నింగ్స్‌లో అరవిందస్వామి వరుస సినిమాలతో మాంచి జోరుమీదున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -