Sunday, April 28, 2024
- Advertisement -

గుంటుర్ టాకీస్‌కు మించిన‌ ర‌ష్మీ అందాలు

- Advertisement -

రష్మీ గౌత‌మ్ ఈ పేరు బుల్లితెర‌పై తెలియ‌ని వారు ఉండ‌రంటే అతిశేయోక్తి కాదు. ఈ టీవీలో ప్ర‌సార‌మ‌య్యే జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోతో మంచి పాపుల‌రిటీని సంపాదించుకుంది. ఈ షోలో ఆమె అందానికి ,యాంక‌రింగ్‌కు చాలామంది ర‌ష్మీకి అభిమానులుగా మారారు. సుధీర్‌తో ల‌వ్ ఎఫైర్ ఆమెను మ‌రింత పాపుల‌రిటీ అయ్యేలా చేసింది. ర‌ష్మీ ప‌లు టీవీ షోల‌కి యాంక‌రింగ్ చేస్తునే చిన్న సినిమాల‌లో హీరోయిన్‌గా న‌టిస్తుంది. గుంటుర్ టాకీస్ సినిమాలో ర‌ష్మీ అందాల‌కు జ‌నాలు థియోట‌ర్ల‌కు క్యూ క‌ట్టారు అంటే ఆమె ఎంతలా త‌న అందాల‌ను ప్ర‌ద‌ర్శించిందో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మ‌ళ్లీ ర‌ష్మి మ‌రో సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది.

ఎస్.జై. ఫిలింస్ పతాకంపై రూపుదిద్దుకున్న చిత్రం ‘అంతకుమించి’. జై, రష్మీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌ అయితే విడుద‌ల చేశారు కాని దీనిని ఎవ‌రు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కాని ర‌ష్మీ త‌న అందాల ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆ నోట ఈ నోట ప‌డి అంద‌రు ఈ ట్రైల‌ర్‌ను చూడ‌టం మొద‌లు పెట్టారు. సినిమా టైటిల్ తగిన‌ట్లుగానే ర‌ష్మీ త‌న సెక్సీ లుక్‌తో రెచ్చిపోయింది. ట్రైల‌ర్‌ను చూస్తుంటే ర‌ష్మీ గుంటురు టాకీస్‌కు మించి త‌న అందాల‌ను ప్ర‌ద‌ర్శించింద‌ని అంద‌రు అనుకుంటున్నారు. మ‌రి సినిమా ద్వారా అయిన ర‌ష్మీకి సినిమాల‌లో అవ‌కాశాలు వస్తాయేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -