Monday, May 13, 2024
- Advertisement -

అమెరికా వెళ్లిపోయిన సాయి ధ‌ర‌మ్ తేజ్

- Advertisement -

సాయి ధ‌ర‌మ్ తేజ్ ఏ సినిమా తీసిన‌ ఆ సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫ్లాప్‌లుగా మారుతున్నాయి. సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇప్ప‌టి వ‌రకు ప‌ది సినిమాలు తీస్తే వాటిలో మూడు సినిమాలు మాత్ర‌మే హిట్‌గా నిలిచాయి. పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌,సుప్రీమ్ సినిమాలు మాత్ర‌మే హిట్ అయ్యాయి. ఇవి కూడా కెరీర్ స్టార్టింగ్‌లో వ‌చ్చిన‌వి.సాయి ధ‌ర‌మ్ తేజ్ మాస్ ఇమేజ్ కోసం ప్ర‌య‌త్నించి చేతులు కాల్చుకున్నాడు. రూటు మార్చి ప్రేమ‌క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అది కూడా వ‌ర్క్ అవుట్ అవ్వలేదు. తాజాగా ఆయ‌న న‌టించిన తేజ్ ఐ లవ్యూ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫ్లాప్‌గా నిలిచింది.

దీంతో సాయి ధ‌ర‌మ్ తేజ్‌తో సినిమాలు చేయ‌డానికి ద‌ర్శ‌క-నిర్మాత‌లు భ‌య‌ప‌డుతున్నారు. సాయి ధ‌ర‌మ్ తేజ్ చేతిలో ప్ర‌స్తుతం ఒకేఒక్క సినిమా ఉంది. ‘నేను శైలజ’ ఫెమ్ కిశోర్ తిరుమల తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నాడు. ఈ సినిమాలోని లుక్ కోసం అమెరికా వెళ్ళాడు. కొత్త మేకోవర్ తో ఇండియా తిరిగొచ్చాక ‘నేను శైలజ’ ఫెమ్ కిశోర్ తిరుమల తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నాడు. ఈ సినిమాకు చిత్ర‌ల‌హ‌రి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -