కాస్టింగ్ కౌచ్ వివాదం ముగిసిపోయిందనకున్న ప్రతిసారి ఎక్కడో ఓ చోట కాస్టింగ్ కౌచ్ అనే పదం వినిపిస్తునే ఉంది. సినిమా ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా కాస్టింగ్ కౌచ్ పోరాటం సాగించారు. ఈ ఉద్యమం అండతో చాలామంది మహిళలు ఇండస్ట్రీలో తమకు ఎదురైనా లైంగిక వేధింపులు గురించి బహింరంగానే వెల్లడించారు. అవకాశాలు పేరిట అమ్మాయిలను లొంగదీసుకుంటున్నారని చాలామంది ఆరోపించారు.
తాజాగా ఇలాంటి సంఘటన మరోకటి బయటికి వచ్చింది. అయితే ఇది జరిగింది వెండితెర సంబంధించినది కాదు, బుల్లితెర నటి రిచా బాద్రా తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూ ద్వారా తెలిపింది. ఓ నిర్మాత అవకాశం ఇస్తానని పిలిపించి, మొదట నన్ను సుఖః పెట్టాలని కండిషన్ పెట్టాడు.ఆ సమయంలో అతను వల్గర్ లాంగ్వెజ్తో కూడా మాట్లాడాడు అని తెలిపింది. నువ్వు టీవీ సీరియల్స్‌లో నటించాలి అంటే నాతో పడుకొక తప్పదని, లేకపోతే అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడట సదరు నిర్మాత.
స్టోరీ డిస్కర్షన్లో భాగంగా హోటల్‌కి రమ్మని పిలిచినప్పటికి తాను కాఫీ షాప్‌కి మాత్రమే వస్తానని క్లారిటీ ఇచ్చిందట రిచా బాద్రా. అతని వ్యవహారం బయటపడిన తరువాత అతని నుంచి తప్పించుకున్నాని తెలిపింది. పెళ్లి చేసుకున్న తరువాత కుటుంబ సభ్యుల అంగీకారంతోనే మళ్లీ సీరియల్స్‌లో నటిస్తున్నానని చెప్పుకొచ్చింది రిచా. బాలీవుడ్ టెలివిజన్ సిరీస్‌లలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా బాగా పాపులర్ అయింది రిచా బాద్రా.
- Advertisement -
సుఖ పెడితేనే అవకాశం ఇస్తానన్నాడు – నటి
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -
