సూపర్‌స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రోబో 2.0 నిన్ననే(గురువారం) విడుదల అయింది.బాలీవుడ్ అక్షయ్ కుమార్ విలన్‌గా నటించిన ఈ సినిమాకు తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సినిమాకు మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో తలైవా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రజినీకి అభిమానులు ఉండటంతో ఈ సినిమాను 10,500 థియేటర్స్ లో విడుదలై కొత్త రికార్డును సృష్టించారు.
రజినీకాంత్ స్టామినా ఏంటో మరోసారి నిరుపించింది ఈ సినిమా.కేవలం తమిళనాటే 30 కోట్లకు పైగా వసూళ్ల వచ్చి ఉంటాదని అంచనా వేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 15 కోట్ల వరకు కలెక్షన్లు ఉండే అవకాశం ఉంది. ఇక అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్రలో నటించటంతో బాలీవుడ్‌లోనూ సినిమా భారీ వసూళ్లే సాధిస్తోంది. తొలి రోజు ఉత్తరాదిలో 20 నుంచి 25 కోట్ల వరకు వసూళ్లు వచ్చి ఉంటాయని భావిస్తున్నారు.
ఇక ఓవర్‌సీస్‌కూడా కలుపుకుంటే 100 కోట్ల మార్క్ ఈజీగానే రీచ్ అయి ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా రెండో కూడా మంచి కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. రెండో ఓవర్ఆల్‌గా ఈ సినిమా 60 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు సమాచారం.ఇంకా వీకెండ్ ఉండటంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.ఈ సినిమా కలెక్షన్లపై చిత్ర నిర్మాత ఎటువంటి ప్రకటన చేయలేదు.