Sunday, April 28, 2024
- Advertisement -

దసరా కి ఎన్టీఆర్ టీజర్.. ప్లాన్ చేస్తున్న జక్కన్న..?

- Advertisement -

రాజమౌళి చేసిన బాహుబలి సినిమా తర్వాత ఇప్పుడు అందరి కన్ను రాజమౌళి దర్శకతంలో వస్తున్న RRR పై నే ఉంది..ఇప్పటివరకు తన సినిమాలు ఒక్కటి కూడా ఫ్లాప్ కాలేదు అంటే రాజమౌళి తన సినిమాలను ఎంత బాగా తీస్తాడో అర్థం చేసుకోవచ్చు అందుకే ఆయన్ని టాలీవుడ్ జక్కన్న అని కూడా అంటారు. టాలీవుడ్ కి వచ్చి దాదాపు ఇరవై ఏళ్ళు అయినా పదికి పైగా సినిమాలు చేసినా ఆయనకు ఒక్క రిమార్క్ గానీ, ఫ్లాప్ రాలేదంటే అయన కు సినిమా పట్ల ఉన్న అంకిత భావం చెప్పనవసరం లేదు.. ఒక్కో సినిమా తో హిట్ కొట్టడమే కాదు టాలీవుడ్ స్థాయిని మార్చాడు.

బాహుబలి తో అయన పేరు ఎంతలా వెలిగిపోయిందో ప్రేత్యకంగా చెప్పనవసరం లేదు.. టాలీవుడ్ పేరు ను దేశమంతటా వినిపించిన ఘనత ఆయనది..బాలీవుడ్ లో రాజమౌళికి బ్రహ్మరథం పట్టారు.. అక్కడి హీరో లు కూడా తమ సినిమా చేయాలి అని కోరారు. కానీ రాజమౌళి ప్రస్తుతం బాహుబలి తర్వాత టాలీవుడ్ హీరోలతో సినిమా చేస్తున్నారు.. RRR అంటూ రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ లతో పవర్ ఫుల్ మల్టీ స్టారర్ గా ఆయన ఈ సినిమా చేస్తున్నారు.. ఇప్పటివరకు ఇలాంటి స్టార్స్ ని పెట్టి ఏ దర్శకుడు టాలీవుడ్ లో సినిమా చేయలేదు.. స్టార్ హీరోల మల్టీ స్టారర్ సినిమా ల ట్రెండ్ ను రాజమౌళి మొదలుపెట్టారని చెప్పాలి..

ఇక ఈ సినిమా నుంచి రామ్ చరణ్ తేజ్ టీజర్ ని రిలీజ్ చేశాడు రాజమౌళి.. అల్లూరి సీతారామ రాజు గా ఆ టీజర్ లో మెగా ఫాన్స్ ని ఉర్రుతలూగించే అంశాలు ఎన్నో ఉన్నాయి.. ఇక ఎన్టీఆర్ ఫాన్స్ కూడా తమ హీరో టీజర్ రిలీజ్ అవుతుందని ఆశించారు కానీ కరోనా వల్ల సినిమా టీజర్ రిలీజ్ కాలేకపోయింది.. దాంతో ఒకింత ఎన్టీఆర్ ఫాన్స్ రాజమౌళి పై ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా.. ప‌రిస్థితులు మామూలయ్యాక టీజ‌ర్ కంటెంట్ కోసం తార‌క్ మీద కొన్ని స‌న్నివేశాలు చిత్రీక‌రించి సాధ్య‌మైనంత త్వ‌ర‌గా అభిమానుల‌కు ట్రీట్ ఇవ్వాల‌ని చూస్తున్నాడు రాజ‌మౌళి. ఈ ఎదురుచూపుల‌తోనే నెల‌లు నెలలు గ‌డిచిపోయాయి. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పునఃప్రారంభం ఇదిగో అదిగో అన్నారు కానీ.. ఎంత‌కీ ఆ రోజు రాలేదు. ఐతే ఎట్ట‌కేల‌కు ఆర్ఆర్ఆర్ టీం చిత్రీక‌ర‌ణ‌కు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. . ముందుగా మూణ్నాలుగు రోజులు ట్ర‌య‌ల్ షూట్ చేసి.. ఆ త‌ర్వాత తార‌క్ మీద కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ మొద‌లుపెడ‌తార‌ట‌.  త్వరలోనే తారక్ మీద ఓ టీజర్ కట్ చేసి వదులుతాడట జక్కన్న..  వచ్చే వేసవిలో ఈ సినిమా ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉందట చిత్ర బృందం..

RRR విషయంలో గట్టిగా ఉన్న రాజమౌళి..?

RRRలో ఎన్టీఆర్ కు బాబాయిగా మోహన్ లాల్ ?

RRR అప్డేట్ : సీన్లు లీక్ చేసి రాజమౌళికి షాక్ ఇచ్చిన నటుడు..!

#RRR ఎన్టీఆర్ చేసే ఈ రాబరీ సినిమాకే హైలైట్ అట..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -