Saturday, April 20, 2024
- Advertisement -

బిగ్ బాస్ 4 కు నాగార్జున బై.. ఏం జరిగింది ?

- Advertisement -

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. నాగార్జున వల్ల ఈ షోకి మరింత హైప్ వచ్చిందని చెప్పాలి. టీఆర్పీ రేటింగ్ లో కూడా ఈ షో టాప్ లో దూసుకెళ్తోంది. అయితే నాగార్జున శని, ఆదివారం మాత్రమే బిగ్ బాస్ లో కనిపిస్తారు. బిగ్ బాస్ గత సీజన్ టైంలో తన బర్త్ డేకి విదేశాలకు వెళ్లినప్పుడు బిగ్ బాస్ యాజమాన్యం రమ్యకృష్ణను రెండు రోజులు హోస్ట్ గా పపించారు.

ఈ సారి కూడా ఒక గెస్ట్ హోస్ట్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ కోసం థాయిలాండ్ వెళ్తున్నాడు. దాదాపుగా రెండు మూడు వారాల పాటు నాగ్ అక్కడే ఉండాల్సి వస్తుంది. అప్పుడు బిగ్ బాస్ ను హోస్ట్ చేసేది ఎవరు అన్నది ప్రశ్నగా మారింది. థాయిలాండ్ నుండి షో కోసం ప్రత్యేకంగా నాగార్జున వచ్చి వెళ్తారా అనేది కూడా చూడాలి. మాములుగా అయితే వచ్చి వెళ్లడం పెద్ద కష్టమేమి కాదు. కానీ ప్రస్తుతం కరోనా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నాగార్జున రావడం అనేది డౌటే.

ఇప్పటికే షూటింగ్ కోసం ప్రభాస్ విదేశాలకు వెళ్లగా.. ఇప్పుడూ నాగార్జున వెళ్తున్నారు. త్వరలోనే ఆయన టీమ్ తో కలిసి విమానం ఎక్కబోతున్నారు. మరి ఈ విషయంపై బిగ్ బాస్ నిర్వాహకులు మరో స్టార్ తో ఒక్క వారం హొస్టింగ్ బాధ్యతలు అప్పజేప్పాలా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఆ స్టార్ ఎవరో త్వరలోనే తెలియనుంది.

మళ్లీ డాన్స్ చేస్తూ రెచ్చిపోయిన ప్రగతి ఆంటీ..!

అదిరిందికి శ్రీముఖి వచ్చింది.. రవి వెళ్ళాడు.. ఏంటి ఈ డ్రామా ?

పవన్ ఫ్యాన్స్ జోలికి వెళ్లిన దేవి నాగవల్లి.. ఏమైంది ?

బెడ్ రూమ్ సీన్స్ చేసి తప్పు చేశాను : ఆండ్రియా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -