ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఇటు మెగా ఫ్యాన్స్, అటు నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా వాళ్లు ఖుషీ అవుతుంటారు. అయితే ఈ సినిమా మీద కరోనా ఎఫెక్ట్ పడింది. పలుమార్లు షూటింగ్ ఆగిపోయింది. ఆ పాటికే విడుదల కావాల్సిన చిత్రం కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడింది. ఇప్పట్లో విడుదల కష్టమే.. ఇక సమ్మర్లోనే వచ్చే చాన్స్ ఉందంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఫ్యాన్స్ డీలా పడ్డారు.
ఆర్ఆర్ఆర్ను రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. చారిత్రక పురుషులు అల్లూరి సీతారామరాజు, కుమ్రం భీం జీవిత కథ ఆధారంగా కొన్ని కల్పనలు జోడించి ఈ మూవీని తెరకెక్కించారు. కాగా ఇవాళ ఆర్ఆర్ఆర్ టీం ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఓ బుల్లెట్ మీద వెళుతూ కనిపిస్తున్నారు. చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

దసరా కానుకగా ఈ మూవీ అక్టోబర్ 13న విడుదల కానుంది. దీంతో సినిమా వస్తుందంటూ మెగా, నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ విడుదల తేదీ అయినా ఫైనల్ యేనా? లేక కరోనా థర్డ్‌వేవ్ వస్తే మళ్లీ వాయిదా తప్పదా? అన్నది ఇక వేచి చూడాలి.
Also Read