Friday, April 19, 2024
- Advertisement -

ఆర్​ఆర్​ఆర్​ విడుదల తేదీ వచ్చేసింది.. ఫ్యాన్స్​ కిక పండగే..!

- Advertisement -

ఆర్​ఆర్​ఆర్​ సినిమా కోసం ఇటు మెగా ఫ్యాన్స్​, అటు నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఏ చిన్న అప్​డేట్ వచ్చినా వాళ్లు ఖుషీ అవుతుంటారు. అయితే ఈ సినిమా మీద కరోనా ఎఫెక్ట్​ పడింది. పలుమార్లు షూటింగ్​ ఆగిపోయింది. ఆ పాటికే విడుదల కావాల్సిన చిత్రం కరోనా ఎఫెక్ట్​తో వాయిదా పడింది. ఇప్పట్లో విడుదల కష్టమే.. ఇక సమ్మర్​లోనే వచ్చే చాన్స్​ ఉందంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఫ్యాన్స్​ డీలా పడ్డారు.

ఆర్​ఆర్​ఆర్​ను రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. చారిత్రక పురుషులు అల్లూరి సీతారామరాజు, కుమ్రం భీం జీవిత కథ ఆధారంగా కొన్ని కల్పనలు జోడించి ఈ మూవీని తెరకెక్కించారు. కాగా ఇవాళ ఆర్​ఆర్​ఆర్​ టీం ఓ పోస్టర్​ను విడుదల చేసింది. ఇందులో రామ్​చరణ్​, ఎన్టీఆర్​ ఓ బుల్లెట్​ మీద వెళుతూ కనిపిస్తున్నారు. చిత్రాన్ని అక్టోబర్​ 13న విడుదల చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్​ ఖుషీ అవుతున్నారు.

దసరా కానుకగా ఈ మూవీ అక్టోబర్ 13న విడుదల కానుంది. దీంతో సినిమా వస్తుందంటూ మెగా, నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ విడుదల తేదీ అయినా ఫైనల్ యేనా? లేక కరోనా థర్డ్​వేవ్​ వస్తే మళ్లీ వాయిదా తప్పదా? అన్నది ఇక వేచి చూడాలి.

Also Read

ఏ సినిమా విడుదల ఎప్పుడు? అంతా గందరగోళమే..!

ఆ ఇద్దరు అగ్ర హీరోలూ.. అలా చేయడం ఇదే తొలిసారి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -